ఎందుకీ ఆత్మకథ
ఆత్మకథ అంటే ఏదో ఒకటి సాధించేసిన వాళ్ళు, గొప్ప వాళ్ళు చదువరులను ఇన్స్పైర్ చెయ్యడానికి రాస్తారు. మరి నేనెందుకు రాస్తున్నా అంటే "ఏం వాళ్ళే రాస్తారా... నాకూ ఒక ఆత్మ ఉంది. దానికీ ఒక కథ ఏడ్చింది." అందుకే రాస్తున్నా అని కాకుండా... నాకెందుకో చిన్నప్పటి నుంచి కథలు రాయడం అన్నా, చదవడం అన్నా చాలా ఇష్టం. కథల్లో నాటకీయత ఉంటే వాటిని బాగా చదివేవాడిని. అదేం కర్మో నా జీవితంలో కూడా అంతే నాటకీయత ఉంది. 28 ఏళ్ల ఈ నా బుల్లి జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. ఎన్నో నేర్చుకున్నాను. ఎన్నో కర్మలు అనుభవించాను. నా సన్నిహితులకు, స్నేహితులకు అవన్నీ చెప్పేవాడిని. ఎప్పటికో ఒకప్పటికి అందరినీ కలిసినప్పుడు వాళ్ళకి నా లైఫ్ డ్రామా చెప్పాలని అనుకునేవాడిని. కానీ 2020 June లో Kidney Atrophy ఉంది అని తెలిసినప్పటి నుంచీ, నాకెందుకో నా లైఫ్ డ్రామాని అందరికీ ఎప్పటికైనా చెప్తాను అనే నమ్మకం సన్నగిల్లింది. అందుకే ఎవరు ఉన్నా లేకున్నా... ఒక్కసారి ఒక బ్లాగ్ లో రాస్తే అది ఎప్పటికీ ఉండిపోతుంది అన్న నమ్మకంతో రాస్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు చదవండి. ఇష్టం లేని వాళ్ళు క్షమించి వదిలెయ్యండి. ఈ బ్లాగ్ లో అందరి గురించి మంచిగానే రాస్తాన...