చాదస్తం
"జాహ్నవి లంచ్ బాక్స్ రెడీ అయిందా?" రూంలోంచే కేక వేశాడు నివాస్. "అవుతుందండీ" అంటూ చెమటలు తుడుచుకుంటూ గబగబా వంటింట్లో పరిగెడుతోంది జాహ్నవి. "ఏంటమ్మా అబ్బాయి ఇప్పుడేగా లేచాడు... అప్పుడే బాక్స్ అని కేకలు వేస్తాడేంటి" తెలియక అడిగింది ఆరోజే ఊరి నుంచి వచ్చిన నివాస్ వాళ్ళ అమ్మమ్మ లక్ష్మమ్మ. "అంతే బామ్మ, రాత్రి పని పూర్తి చేసుకుని పడుకునేసరికే ఒంటిగంట. ఇక లేచేది 8కి, ఆఫీసులో 9 కల్లా ఉండాలని పరిగెడతాడు." కూరలు సర్దుతూ చెప్పింది జాహ్నవి. "అయ్యో... ఇదేంటే" చోద్యంగా చూసింది లక్ష్మమ్మ. ఊరులో త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటైన లక్ష్మమ్మ, ఇదే మొదటిసారి మనవడి దగ్గరకి హైద్రాబాద్ రావడం. జాహ్నవికి ఏదో ఒంట్లో నలతగా ఉందంటే, అందరూ వేరే పనుల్లో బిజీగా ఉండేసరికి తానే ఓ పదిరోజులు ఆ దంపతులకు చేదోడు వాదోడుగా ఉందామని వచ్చింది. బస్సు దిగి వచ్చినప్పటి నుంచి జాహ్నవి పరుగులు, నివాస్ మొద్దు నిద్ర చూసి ముక్కున వేలేస్కుంది. 8.20 కల్లా బోనులోంచి సింహం వచ్చినట్టు ఒక్క ఉదుక్కున్న గబగబ నివాస్ రూంలోంచి బయటకు వచ్చి బ్యాగ్గు సర్దుకుంటున్నాడు."ఏంటి అమ్మమ్మ ప్రయాణం ఎలా ...