ఇంట్లో నుంచి పారిపోయిన నా కథ
నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు పేపర్ చదువుతూ ఉంటే ఒక వార్త నా కంట్లో పడింది. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు అనే ఊర్లో ఎక్కడపడితే అక్కడ వజ్రాలు దొరుకుతాయట. వాటికోసం ఎక్కడి నుంచో ప్రజలు వస్తున్నారట. ఆ వార్త చదివి అబ్బా భలే ఉందే అనుకున్నాను. మా నాన్నని ఆ వార్త నిజమేనా అని అడిగాను. అవును అన్నాడు నాన్న. దాంతో నా దగ్గర ఉన్న స్టేట్ మ్యాప్ తీసుకుని ఆ వజ్రకరూర్ ఎక్కడో వెతికాను. మేము ఎప్పుడూ అనంతపురం వెళ్లేటప్పుడు దారిలో ఉండే, గుంతకల్లు నుంచి ఆ వజ్రకరూర్ చాలా దగ్గరే. అయితే మనం కూడా ఒకసారి వజ్రాల వేట చేయొచ్చు అనుకున్నాను ఆ పిల్ల వయసులో. ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక miss understanding వల్ల నన్ను మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇరగకొట్టారు. అప్పటికే నవోదయ ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలా frustration కి గురయిన నేను, ఇక ఇద్దరూ కలిసి కొట్టిన ఈ దెబ్బలతో ఇంటి నుంచి పారిపోదాం అని ఫిక్స్ అయ్యాను. నాలాగే frustration కి గురైన నా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు. వాడే నా ఫ్రెండ్ అవినాష్. వాడికి చదువు విషయంలో ఇంట్లో ఉన్న ప్రెజర్ తో చాలా frustration తో ఉన్నానని చెప్పాడు. "ఇక భరించి లాభం లేదు అవినాష్. మనం ఇంటి నుంచి ప...