పోస్ట్‌లు

అవరోహణం

చిత్రం
  అనంతపురం జిల్లాలో ఉన్న చానా ఊర్ల లెక్కనే యాలేరు కూడా వట్టిపోయిన భూములు, ఎండిపోయిన తుమ్మచెట్లు, అడుగంటి పారుతున్న పెన్నా వాగుతో నిర్జీవంగా ఉంటుంది. అలాంటి ఊర్లో కూడా బలిజయ్య చాలా చలాకీగా, హుందాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. పొద్దన్నే తన 20 ఎకరాల శనిక్కాయి చేనుకి వెళ్ళొచ్చి స్నానం చేసి ఊర్లో అరుగు మీద పెద్ద వేప చెట్టు కింద ఒక్కడే తెల్లబట్టలు వేస్కుని కూర్చుని చుట్ట కాలుస్తా అందర్ని నవ్వుతూ పలకరిస్తా ఉండేటోడు. ఆ నవ్వుకి కారణం ఆ శనిక్కాయి చేను యాదో లచ్చలు ఇచ్చేస్తాందని కాదు, అదిచ్చేది సంవత్సరానికి ఎనభై నూర్లే. కానీ బలిజయ్యకి ఎన్‌టీవోడు అంటే భలే ఇష్టంలే. ఆయప్ప సీయం అయ్యేతూరికి బలిజయ్య నవ్వు రెండింతలు అయ్యిండాది.            అది చూసి చూసి కొందరికి అసూయ పుట్టింది. బలిజయ్యకి బౌ పొగురప్ప అనుకున్యారు. బలిజయ్య కూడా తక్కువేం కాదు, మాట్లేడేకి మంచిగా మాట్లాడతాడు కాని పెద్దోళ్ళు కనిపిస్తే దణ్ణాలు పెట్టడం. లేచి నుంచోవడం లాంటి పద్దతులేం తెల్వబడవ్. కానీ రోజూ మంచిగా అరుగుదగ్గర కూర్చుని తన పర బేధం లేకుండా, కల్మషం లేకుండా నవ్వుతాడు, మాట్లాడతాడు.   ఓరోజు పొద్దన్...

Rewinded life on birthday - 2022 Dec 8th

చిత్రం
 

My most memorable phase in life - Singapore Township

చిత్రం
 

నా జీవితంలో అత్యంత ఒత్తిడికి గురైన సందర్భాలు

చిత్రం
 

Cats broke my heart 💔 for 3rd time

చిత్రం
For some reason, I always liked cats and hated dogs. Maybe it's due to the influence of my mom. Maybe it's not just influence, there are more logical reasons as well because dogs never seem to be afraid of humans. They also seem so strong that they can easily bite off a man. Oppositely cats are way too small and they are completely afraid of humans. Also compared to dogs, cats are the cleanest. They clean themselves regularly also they are very independent. Nevertheless, dogs might still be the best friend to humans. but I was always afraid of dogs and their energy. I also feel like the humans who can handle the abundant energy of a big-sized dog can even pet a small-sized bear. so here comes a Kid in me, who always tried to lure stray cats by doing this 'pspsps' sound whenever they are around, but never had luck. Even sometimes I used to throw food at them but They always used to run away from me. Until... 2008 (May) I just finished my 10th exams and went to stay in A...

Good Samaritans 👍

You are going on road. You saw someone wounded. Many others just saw him but left in their way. You also did the same. later someone found the cctv footage and started bombarding you, along with others that you guys didn't help. This issue is really affecting your image. Now you have 2 ways to act. 1. Accepting that, it's your mistake of not helping him. But you did it with so and so reasons. 2. Bombarding that wounded person with criticism in reverse saying that it's his mistake to get wounded. I don't mean to relate this with India-Ukraine relations (Trust me I don't 🙃), but in the world of politics... politicians choose 2nd way in 99.999% of the cases with subtle touch of 1st way. Good Samaritans. Isn't it 👍

చాదస్తం

"జాహ్నవి లంచ్ బాక్స్ రెడీ అయిందా?" రూంలోంచే కేక వేశాడు నివాస్.  "అవుతుందండీ" అంటూ చెమటలు తుడుచుకుంటూ గబగబా వంటింట్లో పరిగెడుతోంది జాహ్నవి.  "ఏంటమ్మా అబ్బాయి ఇప్పుడేగా లేచాడు... అప్పుడే బాక్స్ అని కేకలు వేస్తాడేంటి" తెలియక అడిగింది ఆరోజే ఊరి నుంచి వచ్చిన నివాస్ వాళ్ళ అమ్మమ్మ లక్ష్మమ్మ.  "అంతే బామ్మ, రాత్రి పని పూర్తి చేసుకుని పడుకునేసరికే ఒంటిగంట. ఇక లేచేది 8కి, ఆఫీసులో 9 కల్లా ఉండాలని పరిగెడతాడు." కూరలు సర్దుతూ చెప్పింది జాహ్నవి.  "అయ్యో... ఇదేంటే" చోద్యంగా చూసింది లక్ష్మమ్మ. ఊరులో త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటైన లక్ష్మమ్మ, ఇదే మొదటిసారి మనవడి దగ్గరకి హైద్రాబాద్ రావడం. జాహ్నవికి ఏదో ఒంట్లో నలతగా ఉందంటే, అందరూ వేరే పనుల్లో బిజీగా ఉండేసరికి తానే ఓ పదిరోజులు ఆ దంపతులకు చేదోడు వాదోడుగా ఉందామని వచ్చింది. బస్సు దిగి వచ్చినప్పటి నుంచి జాహ్నవి పరుగులు, నివాస్ మొద్దు నిద్ర చూసి ముక్కున వేలేస్కుంది.  8.20 కల్లా బోనులోంచి సింహం వచ్చినట్టు ఒక్క ఉదుక్కున్న గబగబ నివాస్ రూంలోంచి బయటకు వచ్చి బ్యాగ్గు సర్దుకుంటున్నాడు."ఏంటి అమ్మమ్మ ప్రయాణం ఎలా ...

My Career oriented Achievements and Personal failures over last 7 years

I was seeing some of the posts in linkedin about what people learnt in their past 5 years. I also wanted to make such post but at the same time, I want to emphasize about failures as well. Felt that might be more personal, so instead of LinkedIn I'm keeping it in my personal blog.  From worldly point to view, only who achieves can preach about failures. I might not be a Bill gates or Jeff bezos, but in my circumstances I achieved something that I feel I'm proud of (infact everybody should feel the same). so I want to showcase my achievements along with some preachings about my failures. May be one day my failures can help others in one way or other.  For achievements timeline I'll go in Top to bottom approach.  2021 -  Honed all my skills and Joined Verizon Media Services (Yahoo) as Technical Architect in Enterprise Architects team by denying uk chance given by TCS. Due to my health/laziness I tried only 10 days for job and given around 20+ rounds of interviews to 6 ...

ఉప్పూ కారం

చిత్రం
ఓ చల్లటి ఆదివారం మధ్యాహ్నం 12 అవుతుండగానే, అప్పుడే పొయ్యి మీద ఉడుకుతున్న ఘుమ ఘుమలాడే చికెన్ మీద మూత తీసింది నలభై ఏళ్ల కమలమ్మ. నూనె తేలాడుతున్న ఎర్రటి చికెన్ పులుసును కలియతిప్పి, వస్తున్న కమ్మటి వాసనను పీల్చి "హ్మ్మ్ ఉడికేసింది" అంది. హాస్టల్ నుంచి సెలవలకి ఇంటికి వచ్చిన కూతురు వాణికి త్వరగా అన్నం పెట్టేద్దామని స్టవ్ ఆపేసి, కూరను దించేసింది. కూతురు పీట మీద కూర్చోగానే, కంచంలో అన్నం పెట్టేసి, కూర వడ్డించేసి... "ఇంటికాడ అయినా బాగా తినవే తల్లి. ఆ హాస్టల్ తిండి తిని బక్కగా అయిపోయావ్" అంది. చావడిలో బట్టలు ఉతుకుతున్న కమలమ్మ పెద్ద కూతురు కూడా వంత పాడుతూ "అవును బాగా సన్నపడిపోయిందిది. మూడు నెలల్లో మూడు వంతులు సన్నగా అయిపోయింది వాణి" అంది.  వేడి వేడి అన్నంలో కూర కలిపి ముద్ద నోట్లో పెట్టుకోగానే, "అబ్బా కారం" అంటూ గబ గబ నీళ్ళు తాగి అంగలార్చి కళ్ళు తుడుచుకోసాగింది. "కారమా..." అంటూ కొద్దిగా కూర చెయ్యి మీద వేసుకుని రుచి చూసింది కమలమ్మ. "బాగానే ఉంది కదే" అంటూ కూతురు వైపు ఆశ్చర్యంగా చూసింది.  "అయినా మీరు ఇంత కారం తినకూడదు అమ్మ" అంటూ కసు...

పుచ్చకాయ రోజులు 🍉

ఈ మధ్యనే ఒకరోజు Instagram చూస్తుంటే ఎవరో ఒక మలయాళం సినిమా బాగుంది అని పోస్టు పెట్టారు. సినిమా పేరు 'Thanneer Mathan Dinangal'. ఏంటబ్బా ఆ సినిమా అంటూ గూగుల్ చేశా. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లల కథ. ఒక సరదా ప్రేమ కథ. ఎక్కడ చూసినా 8/10 రేటింగ్ ఉంది. ఈ మధ్య వరుసగా కొన్ని మలయాళం సినిమాలు చూసిన నాకు ఈ సినిమా చూడడం పెద్ద పని అనిపించలేదు.  వెంటనే movierulz మావ బ్రో సహాయంతో లటుక్కున డౌన్లోడ్ చేసి, సాయంత్రం స్నానం అయ్యాక ప్రశాంతంగా కూర్చుని సినిమా మొదలెట్టా. సినిమాలో హీరో జేసన్ తన 11th Class కోసం కార్మెల్ అనే స్కూల్ నుండి కొత్తగా ఓ స్కూల్ కి వస్తాడు. రావడం రావడం అతి క్రమశిక్షణ, అతి బాధ్యత చూపిస్తాడు. టీచర్లందరికి జేసన్ చాలా ఇష్టం. కాకపోతే వీడు చేసే అతి, తోటి పిల్లలకు నచ్చదు. అందరూ వీడంటే గుర్రుగా ఉంటారు.  ఇలా కొంతకాలం గడిచాక, ఒకరోజు క్లాసులో పరీక్ష పెడతారు. అది జేసన్ వచ్చాక ఆ స్కూల్లో రాసిన మొదటి పరీక్ష. అందులో 20 మార్కులకు జేసన్ కు 3 మార్కులు వస్తాయి. క్లాసులో చాలా మంది కంటే అది చాలా తక్కువ. దాంతో జేసన్ తో సహా క్లాసులో వాళ్ళు అందరూ చాలా షాక్ కి గురవుతారు. టీచర్లు, "ఏంటి జేసన్ నువ్వు...

బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా??

బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా??  ఈ మాట 2004లో నా 6వ తరగతి తర్వాతి సమ్మర్ హాలిడేస్ లో మా స్పోకెన్ ఇంగ్లిష్ సర్ అడిగాడు. ప్రతి సమ్మర్ హాలిడేస్ లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి కోచింగ్ సెంటర్లకి పంపేవారు మా ఇంట్లో వాళ్ళు. అలా 6 అయ్యాక అనంతపూర్ లో RK spoken english class లో నన్ను మా అన్నయ్యని కలిపి జాయిన్ చేశారు. మా క్లాసులో నేను తప్ప అందరూ ఇంగ్లీష్ మీడియమే. అప్పుడు నా తెలుగు మీడియం ఇంగ్లీష్ చూసిన, ఆ స్పోకెన్ ఇంగ్లిష్ సర్ "బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా?" అని అడిగాడు. సిగ్గుతో తల వంచుకుని "లేదు సర్. తెలుగు మీడియం" అని చెప్పా. బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా??  మళ్ళీ ఇదే మాట 2008 లో ట్రిపుల్ ఐటీలో విన్నా. ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన కొంత కాలం పాటు అసలు సబ్జెక్టు క్లాసులు ఏవీ నడిచేవి కాదు. కరిక్యులం ఫైనలైజ్ అవ్వలేదు అంటూ ఏదో కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇంగ్లీష్ క్లాసులు పెట్టేవాళ్ళు. ఆ సమయంలో క్యాంపస్ మొత్తానికి కలిపి పెట్టిన మొదటి ఎగ్జాం, ఇంగ్లీష్. ఆ ఎగ్జాంలో నాకు వందకు 92 వచ్చాయి. అది మా OMEGA-7 బాయ్స్ లో highest. అప్పుడు నా దగ్గరకు వచ్చిన మా క్లాస్ మెంటర్ సత్య సర్ "బాబు నువ్వు ఇ...

ఇంట్లో నుంచి పారిపోయిన నా కథ

నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు పేపర్ చదువుతూ ఉంటే ఒక వార్త నా కంట్లో పడింది. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు అనే ఊర్లో ఎక్కడపడితే అక్కడ వజ్రాలు దొరుకుతాయట. వాటికోసం ఎక్కడి నుంచో ప్రజలు వస్తున్నారట. ఆ వార్త చదివి అబ్బా భలే ఉందే అనుకున్నాను. మా నాన్నని ఆ వార్త నిజమేనా అని అడిగాను. అవును అన్నాడు నాన్న. దాంతో నా దగ్గర ఉన్న స్టేట్ మ్యాప్ తీసుకుని ఆ వజ్రకరూర్ ఎక్కడో వెతికాను.  మేము ఎప్పుడూ అనంతపురం వెళ్లేటప్పుడు దారిలో ఉండే, గుంతకల్లు నుంచి ఆ వజ్రకరూర్ చాలా దగ్గరే. అయితే మనం కూడా ఒకసారి వజ్రాల వేట చేయొచ్చు అనుకున్నాను ఆ పిల్ల వయసులో.  ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక miss understanding   వల్ల నన్ను మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇరగకొట్టారు. అప్పటికే నవోదయ ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలా frustration కి గురయిన నేను, ఇక ఇద్దరూ కలిసి కొట్టిన ఈ దెబ్బలతో ఇంటి నుంచి పారిపోదాం అని ఫిక్స్ అయ్యాను. నాలాగే frustration కి గురైన నా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు. వాడే నా ఫ్రెండ్ అవినాష్. వాడికి చదువు విషయంలో ఇంట్లో ఉన్న ప్రెజర్ తో చాలా frustration తో ఉన్నానని చెప్పాడు. "ఇక భరించి లాభం లేదు అవినాష్. మనం ఇంటి నుంచి ప...

నా జీవితంలో జాంబవంతులు - Part 2

సక్సెస్ అబ్సెషన్ - అంటే ఎప్పుడూ మనం విజయమే సాధించాలి అనే విపరీతమైన కోరిక. కోరిక ఉండడం మంచిదే, కానీ అది అబ్సెషన్ అవ్వకూడదు. అలా ఉంటే ఒక్క ఓటమి, మనల్ని అధోపాతాళానికి తొక్కేస్తుంది.  నాకూ ఉండేది, సక్సెస్ అబ్సెషన్. పదవ తరగతి వరకు నేనెప్పుడూ ఫస్ట్ రావడంతో దానికే అబ్సెస్ అయిపోయా.  విపరీతమైన పొగరుతో ఉండేవాడిని. నా మీద ఎవ్వరూ జోకులు వెయ్యకూడదు. ఒక హిట్లర్ మెంటాలిటీలో ఉంటూ, ఆఖరికి దేవుడికి కూడా ఫస్ట్ రావాలనే మొక్కునేవాడిని. అలాంటి అబ్సెషన్ తో ఉన్న నేను, అందరూ టాపర్లే అయిన ట్రిపుల్ ఐటీకి వచ్చా.  రాగానే అందరినీ వాళ్ళ 10th మార్కులు అడిగా. వాళ్ళ మార్కుల బట్టి వాళ్ళని బేరీజు వేసి మాట్లాడ్డం మొదలెట్టా. నాకంటే తక్కువ ఉండే వాళ్లు తక్కువ, నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ. అప్పటికి మా Omega-7 లో నాకు, మా ప్రసాద్ కే 10th Highest మార్కులు అనుకుంటా. ఇక నా గర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  అప్పటి వరకు స్కూల్లో నా మీద ఎవరూ జోకులు వేసిన పాపాన పోలేదు. ఇక్కడికి రాగానే, మా APN, రాంబాబు, నౌషాద్, శివ అందరూ నన్ను ఆట పట్టించేవాళ్ళే. నేనేమో సీరియస్ అయిపోయేవాడిని. దాంతో వీడితో ఎందుకులేరా బాబు అ...

నేను అడక్కుండానే ఎవరో చెప్పిన నా జాతకం

నా చిన్నప్పుడు అన్నీ సెలవలకి మేము మా ఊరు ఫిరంగిపురం నుంచి అనంతపురం వెళ్ళే వాళ్లం. ఎందుకంటే మా అమ్మ పుట్టి పెరిగింది అనంతపురంలో. నేను పుట్టింది కూడా అక్కడే. (Me feeling proud as రాయలసీమ బిడ్డ 😝). మా నాన్న నేటివ్ ప్లేస్ గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం. నేను పెరిగింది అక్కడ. ప్రతి సెలవలకి మా అమ్మ పోరు తట్టుకోలేక మా నాన్న మమ్మల్ని అనంతపురం తీస్కెళ్లేవాడు. గుంటూరు నుంచి అనంతపురం అంటే దగ్గర దగ్గర 500 కిలోమీటర్లు. బస్సులో వెళ్తే కష్టం అని ట్రైన్లో వెళ్ళేవాళ్ళం.  చిన్నప్పుడు బస్సు అంటే అస్సలు పడని నాకు, ఆ ట్రైన్ జర్నీ తెగనచ్చేసేది. దగ్గర దగ్గర 12 గంటల ప్రయాణం. రాత్రి కూడా జర్నీ ఉండేది. ప్రయాణంలో తినడానికి ఫుడ్ కట్టుకుని... కోలాహలంగా ఓ పండుగలా వెళ్ళి వచ్చేవాళ్ళం. ప్రయాణంలో నేను ఏ బుజ్జాయో, బాలమిత్ర బుక్కో కొనుక్కుని కిటికీ పక్కన కూర్చొని చదువుకుంటూ ఉంటే... మా నాన్న మాత్రం పక్కన ఎవరైనా సహ ప్రయాణికులు ఉంటే వాళ్ళతో ముచ్చట్లు మొదలెట్టేవాడు. వాళ్ళకి ఒక్క బ్యాంకు డిటైల్స్ తప్ప అన్నీ చెప్పేవాడు. 🤭 అలా ఒక తిరుగు ప్రయాణంలో ట్రైన్లో మా నాన్నకు సీటు పక్కన ఒక ముసలాయన తగిలాడు. రిటైర్డ్ ఇంజనీరుని అని చెప...

నా జీవితంలో జాంబవంతులు - Part 1

సముద్రాన్ని దాటి లంకకి ఎలా చేరాలో తెలీక అందరూ భయపడుతుంటే... జాంబవంతుడు వచ్చి, హనుమంతుడి యొక్క బలమెంతో చెప్తే, వచ్చిన ధైర్యంతో హనుమంతుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయి సముద్రాన్ని దాటి లంకకి చేరాడంట. ఇది రామాయణం.  ఇక నా జీవిత రామాయణంలో నాకు హనుమంతుడికి ఉన్నంత బలం లేదు కానీ, నాకు కాలేజీలో ధైర్యం ఇచ్చిన వాళ్ళు అందరూ నాకు జాంబవంతులే.  అది 2012-13 సమయం. కొత్త క్లాసులోకి మారి ఒక సంవత్సరం దాటినా కూడా నేను ఇంకా CSE 4 లో సరిగ్గా కుదురుకోలేదు. వస్తే తల వంచుకుని క్లాసుకు రావడం, క్లాసు వినడం... రూంకి వెళ్ళి పడుకోవడం తప్ప... నా పేరు అబ్బాయిల్లో కూడా ఎవరికీ పెద్దగా తెలియని సమయం అది. సిన్సియర్ గా ఎంత ప్రయత్నించినా 8 CGPA మటుకు రాని సమయం కూడా అదే. 😜 ఉన్న దరిద్రాలకి తోడు కొత్తగా కౌంటర్ స్ట్రైక్ కూడా అప్పుడప్పుడే ఆడడం మొదలెట్టా. జనరల్ గా మా వాళ్ళు ఆడేప్పుడు ఎవరైనా మ్యాచ్లో సిల్లీగా పని చేస్తే "బాబూ ఎవడు వాడు" అంటూ వాడి కౌంటర్ స్ట్రైక్ పేరుతో అరిచేవాళ్లు.  నేను ఆడడం మొదలెట్టిన కొన్ని రోజులకు "బాబూ ఆ ఛత్రపతి ఎవడమ్మా" అంటూ సంతు, గ్లాడి, రాధా ఇలా కొందరు అడిగేవారు. నేనేం సిల్లీ పని...

నా ఫారిన్ కల

నాకు చిన్నప్పటి నుంచి ఫారిన్ వెళ్ళాలి అని కోరిక. మా బంధువులు కూడా చాలామంది... US, UK ల్లో స్థిరపడ్డారు. నాకు కూడా ఇండియాలో ఉండడం కంటే అక్కడికి వెళ్ళడమే చాలా ఇష్టంగా ఉండేది. కాలేజీలో ఉన్నప్పుడు 2010 లో అనుకుంటా Barron's GRE book ఒకటి కొనుక్కున్నా. అందులో ఉండే Questions solve చేస్తూ ఉండేవాడిని. ఇంగ్లీషులో నాకు గుర్తుండి A grade కంటే తక్కువ ఎప్పుడు రాలా, అందుకే ఆ GRE Questions నాకు పెద్ద కష్టంగా కూడా అనిపించలేదు. ఎలా అయినా B.Tech అయిపోగానే MS కి వెళ్ళిపోదాం అని 2010 టైంలో అనుకునేవాడిని.  కానీ ప్రేమలో పడగానే సమీకరణాలు అన్నీ మారిపోయాయి. మనం ఫారిన్ వెళ్ళిపోయి, తనకి ఇక్కడ వేరే పెళ్లి చేస్తే మళ్ళీ అమెరికాలో దేవదాసులు ఎక్కడ అవుతాంలే అని... ముందు ఇక్కడ జాబ్ తెచ్చుకుని తర్వాత ఆ జాబ్లో ఫారిన్ వెల్దాంలే అని డెసిషన్ మార్చుకున్నా. అనుకున్నట్టుగానే దేవుడి దయవల్ల క్యాంపస్ లోనే జాబ్ వచ్చింది.  ఇన్ఫోసిస్ హైదరాబాద్లో పోచారం క్యాంపస్ లో జాబ్ చేసేవాడిని. పోచారం అంటే హైద్రాబాద్ కి చివర. నేను ప్రేమించిన అమ్మాయి ఏమో మాదాపూర్ లో ఉండేది. ఇక ప్రతి వీకెండ్ తనని కలవడానికి పోచారం టు మాదాపూర్ వచ్చేవాడిని. ఒక...

"Miss"understanding కథ

అవి నా 5వ తరగతి రోజులు. బాల ఛత్రం గాడు 5వ తరగతిలోనే బరితెగించి తిరుగుతున్న రోజులవి. మా స్కూల్లో ప్రతి ఇయర్ వాళ్ళకి 3 సెక్షన్లు ఉండేవి. A సెక్షన్ - అంటే అమ్మాయిల సెక్షన్. అందులో ఉండేది అమ్మాయిలు మాత్రమే. B సెక్షన్ - అంటే బాయ్స్ సెక్షన్. అందులో అబ్బాయిలు మాత్రమే. C సెక్షన్ వచ్చేసి చెత్త సెక్షన్ (నేను పెట్టిన పేరు) కొందరు డ్రాప్ అవుట్స్ కొందరు రీజాయినీస్ తో సగం అబ్బాయిలు సగం అమ్మాయిలతో కచర కచరా గా ఉండేది ఆ క్లాసు.  మా స్కూల్లో వేరే సెక్షన్ అంటే అది వేరే స్కూల్ లానే. A సెక్షన్, B సెక్షన్ కలిపి బ్రేక్స్ ఎప్పుడూ ఇవ్వరు. వాళ్ళ క్లాస్ టైమింగ్ మా క్లాస్ టైమింగ్ అంతా వేరే. అసలు వాళ్ళను చూద్దామన్నా దొరకని పరిస్థితి.  మనం B సెక్షన్ కి లీడర్. లీడర్ అనగానే లీడర్ మూవీలో రాణాలా హంబుల్ గా కాకుండా, రౌడీ అల్లుడులో చిరంజీవిలా ఫీల్ అయ్యేవాడిని. మా అందరి దృష్టిలో C సెక్షన్ అమ్మాయిలు అస్సలు బాగోరు, A సెక్షన్ అమ్మాయిలు బాగుంటారు.  ఒకరోజు మా స్కూల్లో టీచర్లు అందరికీ ఏదో ఎలక్షన్ డ్యూటీ పడింది. తరవాతి రోజు డ్యూటీకి వెళ్తాము అనగా... ముందు రోజు (1st-4th) అన్నీ క్లాసులకు 5th క్లాసు పిల్లలని లీడర్లు గా...

ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసిచూడు - Part 2

చిత్రం
పెళ్లి అయ్యాక, ఇల్లు కొనుక్కున్నాం మేము. కొనుక్కున్నాం అనే కంటే మేమే కట్టుకున్నాం అంటే బాగుంటుందేమో. మేము ఎలా వెతుక్కుని కట్టుకున్నామో ఆ అనుభవాలు ఇవన్నీ. ఇది హైదరాబాదులో ఇల్లు కొనుక్కుందాం అనుకునేవారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా.  పెళ్లి అయ్యాక నేను మొదట రెంటెడ్ హౌస్ కోసం వెతికాను. ముందు మాదాపూర్, Hi-tech City, Gachibowli లో తీస్కుందాం అనుకున్నా. దానికన్నా ఆఫీసులో ఒక మూల పడుకోవడం బెటర్ అని చాలామంది చెప్పారు. ఎందుకంటే అక్కడ నేచురల్ లైఫ్ ఉండదని. ఆఫీసుకి దగ్గర అనే కానీ, కూరగాయలు కనుక్కోవాలన్నా ఏదో ఒక మాల్ కో, లేదా వారానికి ఒకసారి జరిగే సంత కోసమో వెయిట్ చేయాలి అని చెప్పారు. దారుణమైన పొల్యూషన్ లెవెల్స్ ఉంటాయని చెప్పారు. దాంతో ఆ ఐడియా డ్రాప్ చేశా.  డెవలప్ అవుతున్న మణికొండ, నార్సింగి, అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర్లో తీస్కుందాం అనుకున్నా. కానీ ఇన్నర్ ట్రాన్స్పోర్ట్... ఆటోలు గట్రా దొరకడం కష్టం అన్నారు. కార్ ఉంటే తప్ప ఫ్యామిలీకి పని అవ్వదు అన్నారు. ఇక అది కూడా డ్రాప్.  మా అన్నయ్య చందానగర్ లో దాదాపు 8 ఏళ్ల నుంచీ ఉంటున్నాడు. నేను కూడా అక్కడే ఒక 3 నెలలు ఉన్నప్పుడు అర్థమయ్యింది.. అది ఎం...

ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసిచూడు - Part 1

ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసిచూడు అనేది మన తెలుగు సామెత. మన పూర్వీకులు తాము చేసిన అన్నీ పనుల్లోకెల్లా ఈ పనులు చాలా కష్టమని నిర్ధారించి పెట్టిన సామెత అది.  కింద ఒక పుల్ల పడితే దాన్ని ఇక్కడి నుంచి తీసి అక్కడ కూడా పెట్టలేనంత బద్దకం కలిగిన నేను అవి రెండు ఎలా చేశాను అన్నదే ఈ కథ.  ఫస్ట్ పెళ్లి విషయానికి వద్దాం. ఇప్పుడు అందరి అబ్బాయిల పెళ్లి వయసు 30 అయిపోయింది. 30 కంటే ముందు ఎవ్వరూ పెళ్లి చేసుకోని సమయంలో నేను 25 కే చేసేస్కున్నా. లవ్ మ్యారేజ్ కాబట్టి దానికి కారణాలు బోలెడు. ఒక మెయిన్ రీజన్ మాత్రం నా ఆత్రం. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో అన్న ఆత్రంతో ఛత్రం గాడు త్వరగా పెళ్లి చేసుకున్నాడు.  నిజానికి, నేను పుట్టినప్పటి నుంచి సినిమాల్లో తప్ప బయట ఒక్క పెళ్లి కూడా చూడలేదు...!!! ఇది నిజం. నిజంగా నిజం. మా బంధువుల్లో కూడా ఎవ్వరి పెళ్లి కూడా నేను అటెండ్ అవ్వలేదు. ఒక కారణం, ఎక్కువ పెళ్ళిళ్ళు రాత్రులు జరిగేవి. సో అసలే ఆరోగ్యం బాలేని నన్ను ఆ చలిలో తీసుకువెల్లేవాళ్లు కాదు మా అమ్మ నాన్న. ఇంకొకటి చదువు కారణం. మామూలుగా బయట జరిగే తంతులన్నీ చాలా ఎక్కువ సేపు జరిగేవి. అలా బయటే 3-4 గంటలు ఉంటే నా టైం వ...

ఓ గుర్రం కథ

మనిషి సంఘజీవి. సమూహాలలో (Groups) తిరగడం మనిషి లక్షణం. కానీ అంతర్ముఖులు (Introverts) అలా కాదు, ఎవ్వరినీ పెద్దగా కలవరు. సమూహంలో ఉన్నా కూడా ఎవ్వరితో పెద్దగా మాట్లాడరు. చాలా సిగ్గుగా ఉంటారు, రిజర్వుడుగా ఉంటారు. నేను అంత సిగ్గరి కాదు, but రిజర్వుడుగా ఉంటాను.  బహిర్ముఖులు (Extraverts) ఎక్కువ మంది స్నేహితులని సంపాదించుకుంటారు. ఒక సమూహంలో కలిసి తిరుగుతూ, అందరితో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు. నేను ఎక్కువగా మాట్లాడతాను కానీ ఎక్కువ మంది స్నేహితులు లేరు.  నన్ను నేను Introvert అని చెప్పుకోలేను, Extravert అని కూడా చెప్పుకోలేను. మరి నేనేంటి అనే సందిగ్ధంలో ఎప్పుడూ ఉండేవాడిని. ఒక సమూహంలో ఉండేవాడిని, కానీ ఆ సమూహం చెప్పినట్టు నడిచేవాడిని కాదు. A Rebel without cause అంటారు చూసారా, ఆ టైపు. అందుకే మా APN ఎప్పుడూ నన్ను "వీడు మతానికి ఎదురు. మంచానికి అడ్డం" అంటూ ఆటపట్టించేవాడు.  అలా Introvert కి Extravert కి మధ్యలో ఉండలేక, పెర్మనెంట్ గా Introvert గా ఉండిపోదామని సిద్ధపడ్డా. నిదానంగా సమూహాలకు దూరం అవ్వడం మొదలెట్టా. పొరపాటున ఎప్పుడైనా సమూహాలతో కలిసినా, అందులో ఇమడలేక ఏదో అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం నాక...

ఇప్పుడు నా గోల్ ఏంటంటే...

మనందరం జీవితంలో ఒక్కో సమయంలో ఒక్కో గోల్ కోసం పరిగెడతాం. చిన్నప్పుడు బొమ్మల కోసం, కొంచెం పెద్దయ్యాక సినిమా టికెట్ల కోసం, ఇంకొంచెం పెద్దయ్యాక అమ్మాయిల కోసం, ఒక వయసులో మార్కులు, ఉద్యోగం కోసం. ఆ తర్వాత పెళ్లి, ఇల్లు, పిల్లలు... ఇలా మన గోల్ సమయానికి తగ్గట్టు, మన వయసుకు తగ్గట్టు మారిపోతూ ఉంటుంది.  నాకూ అలానే మారింది. స్కూల్లో ఎప్పుడూ టాప్ ర్యాంక్ అనే గోల్ కోసమే పరిగెట్టా. ఆ సమయంలో ఎక్కడ తినకపోతే, మా వాడు వీక్ అయిపోతాడో అని మా వాళ్ళు తెగ ఫుడ్ పెట్టేవాళ్ళు. నేను తినకపోతే కొట్టేవాళ్ళు కూడానూ 😅. దాంతో 10th అయ్యే సరికి 94% వచ్చింది కానీ 74kgs అయ్యా. కనపడిన వాళ్ళందరూ "బాబూ నువ్వు కొంచెం తగ్గాలమ్మా" అనే వాళ్ళు. నా తోటి వాళ్ళందరూ గేలి చేసేవాళ్ళు. దాంతో చాలా Inferior గా ఫీల్ అయ్యేవాడిని. (ఆ బరువు మీద నేను పడ్డ కష్టాలన్నీ బాధతో, "బరువు" అనే కథానిక పేరుతో, 2009 లో నా డైరీలో రాశా. తర్వాత దాన్ని మా APN పూర్తిగా చదివి, నవ్వుకుని... మా క్లాసుకు అదొక కామెడీ కథ చేసాడులేండి.) ఇక బరువు మీద విరక్తితో నేను కాలేజీకి వచ్చాక పెట్టుకున్న ఫస్ట్ గోల్ - లావు తగ్గడం. అర్జంట్ గా తగ్గిపోవాలి. నేను తిన...