సినిమాలకి పాలిటిక్స్ కి ఉన్న సంబంధం
సినిమాలకి పాలిటిక్స్ కి సంబంధం లేదు అని అనుకునే వాళ్ళందరికోసం ఈ థ్రెడ్...
- మనకు సినిమా నుంచి పాలిటిక్స్ కి వెళ్ళిన, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇలా కొందరే తెలుసు. కానీ పాలిటిక్స్ నుంచి సినిమాల్లో కనపడకుండా పనిచేస్తున్న ఎందరో తెలీదు.
- ప్రతి పొలిటీషియన్, తన రాజకీయాల ద్వారా తన స్కాముల ద్వారా వచ్చిన డబ్బును రకరకాల బిజినెస్సుల్లో పెడతారు. ప్రతీ ఇండస్ట్రీలో, ప్రతి మేజర్ కంపెనీలో ఎక్కువ వాటాలు రాజకీయ నాయకుల బినామీ డబ్బే. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న డబ్బు కూడా రాజకీయ నాయకుల బినామీ డబ్బే.
- ఈరోజు మనకు తెలిసింది, బిల్ రాజు కైత్రి మూవీస్ 24 టైల్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌసేస్ వాళ్ళ సొంత డబ్బు ఇచ్చి సినిమాలు నిర్మిస్తాయని. కానీ, వాళ్ళ వెనుక కంటికి కనపడని ఫైనాన్షియర్స్ ఎందరో. ప్రతి ఫైనాన్షియర్ ఏదో ఒక రాజకీయ నాయకుడి బినామీనో స్నేహితుడో. దాహుబలి లాంటి మెగా బడ్జెట్ సినిమా నిర్మించడానికి ఎందరి పోలీషియన్స్ అక్రమ డబ్బు వెళ్ళి ఉంటుందో మనం ఊహించలేం.
- అందుకే సినిమా వాళ్ళంటే రాజకీయ నాయకులకి చులకన. ఒక చిన్న ఎమ్మెల్యే కూడా ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ తో అసోసియేట్ అయ్యి ఉంటాడు. ఈ సినిమా వాళ్లు మనం వేసే బిచ్చంతోనే నడుస్తున్నారు అనే ధీమా. ఒక ఎమ్మెల్యే ఒక బీతా ఆర్ట్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్ ఈజీగా పెట్టగలడు. కానీ పెట్టరు, ఎందుకంటే వాళ్ళ అక్రమ నల్ల డబ్బు బయట పడుతుంది కాబట్టి. అందుకే చీకట్లో ఉండే ఇండస్ట్రీని నడిపిస్తూ ఉంటారు.
- ఇది సినిమాలో నడిచే రాజకీయ డబ్బు అయితే, ఇంకొకటి మీడియా. మీడియా కవర్ చేయకపోతే ఒక్క సినిమా కూడా ఆడదు. మీడియా అనుకుంటే ఎలాంటి సినిమా అయినా ఫ్లాపు చేయగలదు. ఎలాంటి సినిమా అయినా హిట్ చేయగలదు. కాటనరాయుడు, జనతా బ్యారేజ్ సినిమాలే అందుకు ఉదాహరణ.
- ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మీడియా హౌస్... అంటే టివి ఛానెల్స్, న్యూస్ పేపర్స్ మాత్రమే కాదు. పెద్ద యూట్యూబ్ ఛానెల్స్, పెద్ద మీమ్ పేజెస్, ఎక్కువ రీచ్ వచ్చే ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్స్ కూడా 95% మేనేజ్ చేసేది రాజకీయ నాయకులే.
- నమ్మశక్యంగా లేదా... మీరు సరదాగా చూసే గబ్బర్థస్త్, భీ డ్యాన్స్ షో, హార్డ్వేర్ డెవలపర్ ఇలా ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రతీ డబ్బు వెనక రాజకీయ హస్తం ఉంది.
- వీరు అనుకుంటే వాళ్ళకున్న వైడ్ రీచ్ తో ఎలాంటి సినిమా స్టార్ ని అయినా జీరో చేయగలరు. అందుకే ప్రతీ ఒక్క సినిమా వాడు బబ్బేష్ బాబు, గ్రభాస్ రాజు లాంటి పెద్ద స్టార్లు కూడా... ఒంటి మీదకు 40 ఏళ్లు వచ్చినా, రాజకీయాలు అంటే అబ్బే మాకు తెలీదు అంటారు. ఆడియో ఫంక్షన్లలో మాత్రం ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు కనపడతారు. ప్రతి రోజూ రాజకీయ మకిలి అంటిన డబ్బుతోనే తాము నడుస్తున్నాము.... వాళ్ళకి ఎదురెళ్తే పుట్టగతులు ఉండవు అని బాగా తెలిసే, సేఫ్ గా జీవితాంతం ఆ డబ్బు సంపాదించి బయట పడతారు.
- కానీ అన్ని తెలిసి కూడా... తాను జీరో అయిపోతాను అని ఎరిగి కూడా... చీకటి మేరునఘాల్లా నడిచే రాజకీయ నాయకులకి ఎదురెళ్తున్నందుకు పవన్ కళ్యాణ్ కి సలాం కొట్టనివాడు మనిషే కాదు. అందుకే ఆయన మనుషుల్లోకెల్లా అత్యుత్తముడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి