ఓ గుర్రం కథ

మనిషి సంఘజీవి. సమూహాలలో (Groups) తిరగడం మనిషి లక్షణం. కానీ అంతర్ముఖులు (Introverts) అలా కాదు, ఎవ్వరినీ పెద్దగా కలవరు. సమూహంలో ఉన్నా కూడా ఎవ్వరితో పెద్దగా మాట్లాడరు. చాలా సిగ్గుగా ఉంటారు, రిజర్వుడుగా ఉంటారు. నేను అంత సిగ్గరి కాదు, but రిజర్వుడుగా ఉంటాను. 

బహిర్ముఖులు (Extraverts) ఎక్కువ మంది స్నేహితులని సంపాదించుకుంటారు. ఒక సమూహంలో కలిసి తిరుగుతూ, అందరితో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు. నేను ఎక్కువగా మాట్లాడతాను కానీ ఎక్కువ మంది స్నేహితులు లేరు. 

నన్ను నేను Introvert అని చెప్పుకోలేను, Extravert అని కూడా చెప్పుకోలేను. మరి నేనేంటి అనే సందిగ్ధంలో ఎప్పుడూ ఉండేవాడిని. ఒక సమూహంలో ఉండేవాడిని, కానీ ఆ సమూహం చెప్పినట్టు నడిచేవాడిని కాదు. A Rebel without cause అంటారు చూసారా, ఆ టైపు. అందుకే మా APN ఎప్పుడూ నన్ను "వీడు మతానికి ఎదురు. మంచానికి అడ్డం" అంటూ ఆటపట్టించేవాడు. 

అలా Introvert కి Extravert కి మధ్యలో ఉండలేక, పెర్మనెంట్ గా Introvert గా ఉండిపోదామని సిద్ధపడ్డా. నిదానంగా సమూహాలకు దూరం అవ్వడం మొదలెట్టా. పొరపాటున ఎప్పుడైనా సమూహాలతో కలిసినా, అందులో ఇమడలేక ఏదో అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం నాకు ఇన్ఫోసిస్ మైసూరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎదురైంది. 

అప్పుడు మైసూరులో క్లాసుకు నడుస్తూ వెళ్తున్నపుడు, మా అమృతం నాకో మాట చెప్పాడు. "ఒక సమూహంలో (గ్రూపులో) ఎప్పుడూ రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు గుర్రాలు. అంటే టీం ప్లేయర్స్. వీళ్ళు అవతలి వాళ్ళ ఆదేశాలు పాటిస్తూ ఉంటారు. అవసరమైతే సలహాలు ఇస్తారు కానీ, సమూహం యొక్క దిశను మార్చాలి అనుకోరు. సమూహం ఎలా పోతే వీళ్ళు అలానే వెళ్తారు. 

ఇంకొక రకం మనుషులు... సమూహ చోదకులు (డ్రైవర్లు/లీడర్లు). వీళ్ళు సమూహ దిశను మార్చాలి అనుకుంటారు. అందరి కంటే తామే బాగా సమూహాన్ని నడిపించగలం అనుకుంటారు. గుర్రాలకు కళ్లెం వేసి నడిపిస్తారు. వీళ్లు వేరే డ్రైవర్ల కింద ఎక్కువ కాలం ఉండలేరు. అయితే వాళ్ళే డ్రైవర్లు అవుతారు లేదా వెంటనే తమదైన సమూహం ఏర్పాటు చేసుకుంటారు. నువ్వు, డ్రైవర్ గా ఉండలేకపోతే కనీసం గుర్రంగా అయినా ఉండాలి. మధ్యరకంగా అయితే కుదరదు" అన్నాడు. 

నాకు సమాధానం దొరికినట్టు అనిపించింది. అప్పటి నుంచి నన్ను నేను ఏ సమూహం (గ్రూప్) కి వెళ్ళినా గుర్రంగా మార్చేసుకున్నా. ఆ గ్రూప్ కి డ్రైవర్ గా ఉన్నవాడి మాటలు గుడ్డిగా ఫాల్లో అయ్యేవాడిని. అలా నాకు హ్యూమన్ బిహేవియర్ గురించి చక్కటి క్లారిటీ ఇచ్చిన మా అమృతరావుకి - Thank you 🥰🥰

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం