ఇప్పుడు నా గోల్ ఏంటంటే...
మనందరం జీవితంలో ఒక్కో సమయంలో ఒక్కో గోల్ కోసం పరిగెడతాం. చిన్నప్పుడు బొమ్మల కోసం, కొంచెం పెద్దయ్యాక సినిమా టికెట్ల కోసం, ఇంకొంచెం పెద్దయ్యాక అమ్మాయిల కోసం, ఒక వయసులో మార్కులు, ఉద్యోగం కోసం. ఆ తర్వాత పెళ్లి, ఇల్లు, పిల్లలు... ఇలా మన గోల్ సమయానికి తగ్గట్టు, మన వయసుకు తగ్గట్టు మారిపోతూ ఉంటుంది.
నాకూ అలానే మారింది. స్కూల్లో ఎప్పుడూ టాప్ ర్యాంక్ అనే గోల్ కోసమే పరిగెట్టా. ఆ సమయంలో ఎక్కడ తినకపోతే, మా వాడు వీక్ అయిపోతాడో అని మా వాళ్ళు తెగ ఫుడ్ పెట్టేవాళ్ళు. నేను తినకపోతే కొట్టేవాళ్ళు కూడానూ 😅. దాంతో 10th అయ్యే సరికి 94% వచ్చింది కానీ 74kgs అయ్యా. కనపడిన వాళ్ళందరూ "బాబూ నువ్వు కొంచెం తగ్గాలమ్మా" అనే వాళ్ళు. నా తోటి వాళ్ళందరూ గేలి చేసేవాళ్ళు. దాంతో చాలా Inferior గా ఫీల్ అయ్యేవాడిని. (ఆ బరువు మీద నేను పడ్డ కష్టాలన్నీ బాధతో, "బరువు" అనే కథానిక పేరుతో, 2009 లో నా డైరీలో రాశా. తర్వాత దాన్ని మా APN పూర్తిగా చదివి, నవ్వుకుని... మా క్లాసుకు అదొక కామెడీ కథ చేసాడులేండి.)
ఇక బరువు మీద విరక్తితో నేను కాలేజీకి వచ్చాక పెట్టుకున్న ఫస్ట్ గోల్ - లావు తగ్గడం. అర్జంట్ గా తగ్గిపోవాలి. నేను తిన్నానా లేదా అని ఎవరూ పట్టించుకునే వారు ఉండరు కాబట్టి, కాలేజికి రాగానే అన్నం తినడం మానేశా. రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే మెస్ కి వెళ్ళేవాడిని. తింటే ఎగ్ పఫ్ లేదా Lays చిప్స్ మాత్రమే తినేవాడిని.
ఆ రోజుల్లో కాలేజీలో పొద్దున బ్రేక్ ఫాస్ట్ మహా అయితే వారానికి ఒకసారి చేసేవాడిని అంతే. సాయంత్రం కూడా కాంటీన్ నుంచి తెచ్చుకున్న పల్లీలు తినేవాడిని తప్ప డిన్నర్ చేయడం కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు మా నాన్న చికెన్ పకోడీ/కాజు తెస్తే అవి దాచుకుని తినేవాడిని. అలా ఎప్పుడు పడితే అప్పుడు తినడం కూడా ఏదో గొప్పలా ఫీల్ అయ్యేవాడిని. నేను సన్నపడుతున్నా అనే గోల్ సాధిస్తున్నా అని గర్వంగా ఉండేవాడిని.
మా రూంలో ఉన్న మా గని (గణేష్ పాతూరు) మాత్రం మెస్ కి ఒకే టైం కి వెళ్ళేవాడు. ప్రాపర్ డైట్ ఫాల్లో అయ్యేవాడు. exercise చేసే వాడు. తను అలా టైంకి మెస్ కి వెళ్తుంటే... తనను చూసి నేను కామెడీ చేసే వాడిని "ఏంటి గని గంట కొట్టిందా" అనే వాడిని. తను నిద్ర కూడా ఒకే సమయం చూసుకుని పడుకునేవాడు. నేను, మా సూరి బాబు, భల్లు కలిసి జోకులు వేసే వాళ్ళం. కానీ గని మాత్రం తన టైం టేబుల్ ఎప్పుడూ మార్చుకోలేదు. అప్పుడు తను అలా ఎందుకు చేశాడో నాకు ఎక్కలేదు.
2008 లో అలా కాలేజీలో మొదలైన నా ఇర్రెగ్యులర్ ఈటింగ్, 2020 వరకు వచ్చింది. కాలేజీ లో ఉన్నప్పుడు గోల్ సన్నబడాలని, ఉద్యోగంలోకి వచ్చాక గోల్... వర్క్ బాగా చేద్దామని. పొద్దున్నే ఆఫీస్ కి టైంకి వెళ్ళాలని టిఫిన్ తినను. మధ్యాహ్నం వర్క్ అయ్యేదాకా లంచ్ తినను. ఒక్కోసారి లంచ్... స్నాక్స్ టైంలో సాయంత్రం 5 కి తినేవాడిని. మిస్ అయితే రాత్రి 8 కి తినేవాడిని. అప్పుడు కూడా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, నా వర్క్ అనే గోల్ వైపు 100% ఎఫర్ట్ పెడుతున్నా అని.
అలా ఆ సమయానికి ఉన్న రకరకాల గోల్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, నా ఆరోగ్యానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చా. దాని వల్ల నా ఆరోగ్యాన్ని నేను బాగా పాడుచేసుకున్నా.
2010 లో మా గని ఫాల్లో అయిన డైట్, నేను 2020 లో ఆరోగ్యం పాడయ్యాక మొదలెట్టా. అదేదో అప్పుడే మా గనిని చూసి నేర్చుకుని ఉంటే, ఇప్పుడు నా లైఫ్ వేరేలా ఉండేది కదా అనిపిస్తూ ఉంటుంది నాకు.
అందుకే మీరు అందరూ కూడా... మీకు వంద గోల్స్ ఉండనీ. అన్నిటి కంటే ఫస్ట్ గోల్ గా మాత్రం ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు నా ఫస్ట్ అండ్ ఫరెవర్ గోల్ ఆరోగ్యం మాత్రమే. ఆరోగ్యం అంటే ఒక్క శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా... This too shall pass అని అనుకుని, ప్రశాంతంగా ఉండండి. Too far ahead గా ఆలోచించొద్దు. జస్ట్ రేపటి గురించి మాత్రమే ఆలోచించండి. మీరు చేయగలిగిన బాధ్యతలు మాత్రమే తీసుకోండి. చేయలేనివి simple గా no చెప్పేయండి. ఒక ఫేవరెట్ పాస్ టైం పెట్టుకుని, రోజూ ఆ పని చేయండి. ఆనందంగా ఉండండి.
శారీరక ఆరోగ్యం కోసం మాత్రం టైంకి లేవాలి. రోజూ ఒకే టైంకి తినాలి. ఒకే క్వాంటిటీ తినాలి. Exercise చేయాలి. Six pack కోసం కాదు మీ స్వంత ఆరోగ్యం కోసం. ఎందుకంటే నీకు తెలివి తక్కువగా ఉన్నా పర్లేదు. నీకు డబ్బు తక్కువ ఉన్నా పర్లేదు. నీ ఆరోగ్యం మాత్రం తక్కువ ఉండకూడదు. ఈరోజు నీ శరీరంలో ఒక అవయవం పాడైతే దాని రిపైర్ కి కనీసం పది లక్షలు అవుతుంది. ఈ ఇండియాలో ఉన్న వరస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల, అది సెట్ అయిద్దో లేదో కూడా మనకు తెలీదు. అందుకే మీ వర్క్ లో కానీ, లైఫ్ లో కానీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి హెల్త్... because ఆరోగ్యమే మహాభాగ్యము. అదుంటే చాలు ఎప్పటికో ఒకప్పటికి సక్సెస్ అయిపోతాం. All the best 👍
Nice one👍🏼
రిప్లయితొలగించండి😀😀
తొలగించండి