నా జీవితంలో జాంబవంతులు - Part 1
సముద్రాన్ని దాటి లంకకి ఎలా చేరాలో తెలీక అందరూ భయపడుతుంటే... జాంబవంతుడు వచ్చి, హనుమంతుడి యొక్క బలమెంతో చెప్తే, వచ్చిన ధైర్యంతో హనుమంతుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయి సముద్రాన్ని దాటి లంకకి చేరాడంట. ఇది రామాయణం.
ఇక నా జీవిత రామాయణంలో నాకు హనుమంతుడికి ఉన్నంత బలం లేదు కానీ, నాకు కాలేజీలో ధైర్యం ఇచ్చిన వాళ్ళు అందరూ నాకు జాంబవంతులే.
అది 2012-13 సమయం. కొత్త క్లాసులోకి మారి ఒక సంవత్సరం దాటినా కూడా నేను ఇంకా CSE 4 లో సరిగ్గా కుదురుకోలేదు. వస్తే తల వంచుకుని క్లాసుకు రావడం, క్లాసు వినడం... రూంకి వెళ్ళి పడుకోవడం తప్ప... నా పేరు అబ్బాయిల్లో కూడా ఎవరికీ పెద్దగా తెలియని సమయం అది. సిన్సియర్ గా ఎంత ప్రయత్నించినా 8 CGPA మటుకు రాని సమయం కూడా అదే. 😜
ఉన్న దరిద్రాలకి తోడు కొత్తగా కౌంటర్ స్ట్రైక్ కూడా అప్పుడప్పుడే ఆడడం మొదలెట్టా. జనరల్ గా మా వాళ్ళు ఆడేప్పుడు ఎవరైనా మ్యాచ్లో సిల్లీగా పని చేస్తే "బాబూ ఎవడు వాడు" అంటూ వాడి కౌంటర్ స్ట్రైక్ పేరుతో అరిచేవాళ్లు.
నేను ఆడడం మొదలెట్టిన కొన్ని రోజులకు "బాబూ ఆ ఛత్రపతి ఎవడమ్మా" అంటూ సంతు, గ్లాడి, రాధా ఇలా కొందరు అడిగేవారు. నేనేం సిల్లీ పని చేశానో తెలీక... నేనే ఛత్రపతి అని చెప్తే పరువు పోతుంది అని, చెప్పకుండా గమ్మున కూర్చునేవాడిని. ఓరోజు "ఛత్రపతి ఎవరో చెప్పండి. లేకపోతే కిక్ చేసేస్తాం" అని సరదాగా ఎవరో అన్నారు. "నేనే నేనే" అంటూ చిన్నగా చెయ్యి ఎత్తా.
అలా నేను కూడా కౌంటర్ స్ట్రైక్ ఆడతాను అని మా క్లాసులో వాళ్ళకి మెల్లిగా తెలియడం మొదలయింది. నా అసలు పేరు తెలియని వాళ్ళు, నన్ను ఛత్రపతి అనే పిలవడం మొదలెట్టారు. ఓరోజు సాయంత్రం పూట క్లాసులు అయ్యాక... మా వాళ్ళలో ఏదో డిస్కషన్ మొదలయ్యింది.
"ఎవరు కౌంటర్ స్ట్రైక్ బెస్ట్ ప్లేయర్ అని"
కొందరు బంటి బెస్ట్ ప్లేయర్ అంటున్నారు. కొందరు ఛార్లెస్ బెస్ట్ ప్లేయర్ అంటున్నారు. నేను సైలెంట్ గా ఓ మూలన కూర్చుని చూస్తూ ఉన్నా.
ఈలోపల ఎవరో ఉండి వరస్ట్ ప్లేయర్ మాత్రం వీడు అంటూ ఎవర్నో చూపించారు. అటు తలెత్తి చూసాను. ఎవర్నో చూపించి అందరూ నవ్వుకుంటున్నారు. హమ్మయ్య నన్ను అనలేదు, బతికిపోయా అనుకున్నా. ఈలోపు రాధా... "నా ఫేవరేట్ ప్లేయర్ మాత్రం ఛత్రపతి. మామూలుగా ఆడడు" అన్నాడు.
That was my most favourite moment in CS life. 😎. ఆ తర్వాత కూడా రాధా ఎప్పుడూ తన ఫేవరెట్ ప్లేయర్ నేనే అని చెప్పేవాడు.
ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆఫీసులో ఏదైనా నెగటివ్ ఇష్యూ జరిగితే, అక్కడ జెనరేట్ అయిన నెగటివ్ ఎనర్జీ మనకు తెలియకుండా రోడ్లో ట్రాఫిక్ మీదకో... ఇంట్లో మనుషుల మీదకో కన్వర్ట్ అవుతుంది. వాళ్ళ మీద అరిచేస్తాం. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా కన్వర్ట్ అవుతుంది.
రాధా, కౌంటర్ స్ట్రైక్ లో నేను మంచి ప్లేయర్ అని చెప్పిన చిన్న మాట, నాకు ఒకలాంటి సుప్రీం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. నేనే సుప్రీం అనుకునేలా చేసింది. ఆ ఎనర్జీ కౌంటర్ స్ట్రైక్ నుంచి చదువులోకి, తర్వాత నా CGPA లోకి కూడా కన్వర్ట్ అయింది. అప్పటి నుంచి అన్నీ 8 లు కొన్ని 9 లు కూడా వచ్చాయి. (అన్నీ CGPA లు సిన్సియర్ గా ఎగ్జామ్ రాస్తేనే వచ్చాయి అని చెప్పను అనుకోండి 😉). అదే పాజిటివ్ ఎనర్జీ నా ఉద్యోగంలో కూడా కంటిన్యూ అయింది.
మనం చాలా సార్లు లైఫ్ లో, మనకు నచ్చిన మనుషుల గురించి లేదా వాళ్ళు చేస్తున్న మంచి పనుల గురించి వాళ్ళతో చెప్పం. అలా సైలెంట్ గా చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకసారి, మీకు వాళ్ళలో ఏం నచ్చుతుందో వాళ్ళతో సరదాగా చెప్పి చూడండి. అది వాళ్లకు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందో మీకు తెలీదు.
అలా తనకు తెలీకుండానే ఒక చిన్న మాటతో నాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి నాకు ఒక జాంబవంతుడు అయిన మా రాధాకి చాలా థాంక్స్. 😃
(రాధా మా క్లాసు టాపర్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కమాండ్ అమోఘం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ క్లియర్ గా తెలుసుకుంటాడు. అంతే క్లియర్ గా అందరికీ explain కూడా చేస్తాడు. ఒక్క రాధా క్లాసు వినే మా క్లాసు బాయ్స్ అందరూ సబ్జెక్ట్స్ పాస్ అయ్యారంటే అది అతిశయోక్తి కాదు. నేను అప్పుడప్పుడు రాత్రి 8 కి క్లాసు ఓపెన్ అంటే 7.30 కే వెళ్ళి క్లాసు డోర్స్ తీయకపోతే బయట వెయిట్ చేసేవాడిని. ఆ టైంకే రాధా ఖచ్చితంగా వచ్చేసి అక్కడ ఉండేవాడు. ఆ అరగంట సమయంలో రాధా చాలా మంచి విషయాలు చెప్పేవాడు. గత కొన్నేళ్లుగా చెన్నైవాసం చేస్తున్న రాధా... ఫ్యూచర్ లో షికాగో సుబ్బారావు టైపులో షికాగో రాధాకృష్ణగా సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ - ఇట్లు ఛత్రం 💕💕)
True.. Radha vallani konni subjects nenu pass ayya..
రిప్లయితొలగించండిఆచార్య of CSE-4
తొలగించండిsuper
రిప్లయితొలగించండి😎😎😃
తొలగించండి