ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసిచూడు - Part 2

పెళ్లి అయ్యాక, ఇల్లు కొనుక్కున్నాం మేము. కొనుక్కున్నాం అనే కంటే మేమే కట్టుకున్నాం అంటే బాగుంటుందేమో. మేము ఎలా వెతుక్కుని కట్టుకున్నామో ఆ అనుభవాలు ఇవన్నీ. ఇది హైదరాబాదులో ఇల్లు కొనుక్కుందాం అనుకునేవారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. 

పెళ్లి అయ్యాక నేను మొదట రెంటెడ్ హౌస్ కోసం వెతికాను. ముందు మాదాపూర్, Hi-tech City, Gachibowli లో తీస్కుందాం అనుకున్నా. దానికన్నా ఆఫీసులో ఒక మూల పడుకోవడం బెటర్ అని చాలామంది చెప్పారు. ఎందుకంటే అక్కడ నేచురల్ లైఫ్ ఉండదని. ఆఫీసుకి దగ్గర అనే కానీ, కూరగాయలు కనుక్కోవాలన్నా ఏదో ఒక మాల్ కో, లేదా వారానికి ఒకసారి జరిగే సంత కోసమో వెయిట్ చేయాలి అని చెప్పారు. దారుణమైన పొల్యూషన్ లెవెల్స్ ఉంటాయని చెప్పారు. దాంతో ఆ ఐడియా డ్రాప్ చేశా. 

డెవలప్ అవుతున్న మణికొండ, నార్సింగి, అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర్లో తీస్కుందాం అనుకున్నా. కానీ ఇన్నర్ ట్రాన్స్పోర్ట్... ఆటోలు గట్రా దొరకడం కష్టం అన్నారు. కార్ ఉంటే తప్ప ఫ్యామిలీకి పని అవ్వదు అన్నారు. ఇక అది కూడా డ్రాప్. 

మా అన్నయ్య చందానగర్ లో దాదాపు 8 ఏళ్ల నుంచీ ఉంటున్నాడు. నేను కూడా అక్కడే ఒక 3 నెలలు ఉన్నప్పుడు అర్థమయ్యింది.. అది ఎంత మంచి ఏరియానో . DLF, గచ్చిబౌలి లో ఆఫీసులకు వెళ్ళాలి అన్నా దగ్గరే. hi-tech City లో ఉన్న ఆఫీసులకు వెళ్ళాలి అన్నా దగ్గరే. ఆ కూకట్ పల్లి లోనో,మియాపూర్, ప్రగతి నగర్ లాంటి టైట్ ఏరియా కన్నా నాకు చందానగర్ చాలా బెటర్ అనిపించింది. పైగా ఆంధ్రా వాళ్లు ఎక్కువగా ఉంటారు. దాంతో పదమూడు వేలలో చందానగర్లో ఒక 2BHK రెంట్ కి తీస్కున్నాం. 

ఓ బండి కొనుక్కుని రోజూ వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నాకు చందానగర్ నచ్చేసింది. ఇక ఓన్ హౌస్ కూడా అక్కడే తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయా. 

అయితే ఈ టైంలో విల్లాలకి మామూలు క్రేజ్ లేదు. ఓన్ ల్యాండ్ ఉంటుంది. 2 స్టైర్స్ ఉంటాయి. మినిమం 4bhk ఉంటుంది. కాబట్టి ఓన్ గా విల్లా తీస్కుందాం అనుకున్నా. 
చాలా విల్లాలు చూసి కూడా వచ్చాం. అవన్నీ చాలా దూరంలో ఉన్నాయి. మెయిన్ సెంటర్ నుంచి కనీసం 5Km వెళ్తే కానీ విల్లాలు లేవు. కొంచెం ఎమర్జెన్సీ కి హాస్పిటల్ కి వెళ్లాలన్నా కార్లో కనీసం ఒక 30mins జర్నీ చేయాలి. 

ఇంకొకటి నేను చూసింది ఏంటంటే చాలా విల్లాలు, చెరువుల్ని పూడ్చి కట్టారు. నా కళ్ళారా నేను అమీన్పూర్లో చూసాను. ఇంకా విల్లా వల్ల ప్రాబ్లం ఏంటంటే... ఉంటే ఒక 4-5 మెంబెర్స్ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. అంతే కానీ ఉద్యోగం చేసే ఇద్దరు ఉంటే మాత్రం ఒక విల్లా/ఇండిపెండెంట్ హౌస్ మేనేజ్ చేయలేరు. గేటెడ్ విల్లాలు తీస్కున్నా కూడా సెక్యూరిటీ అండ్ క్లీనింగ్ చాలా కష్టం. మనుషుల్ని పెట్టుకుంటే తడిచి మోపెడు అవుతుంది. అంత దూరం కాబట్టి కార్ పక్కాగా కావాలి. ఇవన్నీ ఎలా లేదన్నా కనీసం 90L-1C అయిపోతోంది. ఫ్యూచర్ లో ఆ విల్లా రేట్ పెరుగుతుంది అనుకున్నా కూడా, ఆ రేట్ పెరిగే దాకా ఆ ఏరియా డెవలప్ అయ్యేదాకా మనం ఒక 5-10 ఇయర్స్ డైలీ నీడ్స్ కోసం కష్టపడాలి. ఆ కష్టం మనం పడగలమా అనిపించింది. నాకైతే నేను ఆ డబ్బేదో పెట్టీ మెయిన్ సెంటర్లో ఫ్లాట్ తీస్కుందాం... ఎక్కువ కష్టం పడకూడదు అని ఫిక్స్ అయ్యా. 

ఇక ఫ్లాట్ ఒక 60-70L బడ్జెట్ లో 2bhk అనుకున్నా. మా దగ్గర్లో చాలా తిరిగాం. 72L కి చందానగర్ మెయిన్ సెంటర్ కి 0.5km లో ఒక 2bhk చూసాం. చాలా చిన్నగా అనిపించింది. నేను తీస్కుందాం అనుకున్నా కూడా వైఫ్ డ్రాప్ అయిపోయింది. చిన్న రూమ్స్ వద్దు అని. 

తర్వాత 76L కి చందానగర్ మెయిన్ సెంటర్ కి ఓ కిలోమీటర్ లోపల ఉన్న 3bhk తీస్కుందాం అనుకున్నాం. అది అప్పటికి కన్స్ట్రక్షన్ ఫుల్ గా ఫినిష్ అయిపోయి ఉంది. చాలా బాగుంది. జంగారెడ్డిగూడెం నుంచి మా మావయ్య గారిని కూడా పిలిపించి చూపించాం. కానీ కిలోమీటరు లోపల అంటే, వైఫ్ ఆఫీస్ అయ్యాక నైట్ లేట్ గ వస్తే కష్టం అని ఆగిపోయా. అందరూ పర్లేదు తీస్కో అన్నారు కానీ నేనే ఆగిపోయా. 

మెయిన్ రోడ్, మెయిన్ సెంటర్ కి చాలా దగ్గర్లో నేషనల్ హైవే నుంచి జస్ట్ వంద అడుగుల దూరంలో ఇంకో 3bhk మా వాళ్ళు చూశారు. అది జస్ట్ అండర్ కస్ట్రక్షన్. ప్లాన్ చాలా బాగుంది. 3 బాల్కానీలు. VIP ప్రీమియం అపార్ట్మెంట్స్. ఏం కావాలన్నా 20 అడుగులు వేస్తే దొరికేస్తాయి. North East ఓపెనింగ్. కానీ అన్నీ కలిపి 86L చెప్పారు. నా గుండె ఢమాల్ అంది. మా వాళ్ళు మాత్రం తీస్కో అన్నారు. నేను ఆ కాస్ట్ చూసి వెనకడుగు వేశా. ఇక మా వాళ్ళు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే ఇక తప్పక తీసుకున్నా ఆ 3bhk. అక్కడ నుంచి మొదలయింది మా ఇంటి కష్టం. 

మనందరికీ ఒక మిథ్య ఎంటంటే under construction లో ఉన్న ఇల్లు అయితే మనం బాగా కష్టమైజ్ చేయించుకోవచ్చు అని. అవును కష్టమైజ్ చేయించుకోవచ్చు, కానీ ఎప్పుడు... మీకు బాగా తెలిసిన ఇంటీరియర్ డిజైనర్లు, వర్కర్లు ఉన్నప్పుడు. లేకపోతే మాత్రం వాళ్ళు మీకు లక్షల్లో బిల్ వేస్తారు. అందుకే మాకు 86L నుంచి మొదలై చివరకు 95L అయింది మా ఫ్లాట్. 

ప్రతి ఒక్క డిజైన్... ఫాల్స్ సీలింగ్ నుంచి, కబ్బోర్డ్స్ డిజైన్ వరకు మనం ఒకటి అనుకుంటాం. వాడికి చెప్తాం. వాడికి అర్థం కాదు. వాడికి వచ్చిన డిజైన్స్ ఇస్తాడు. ఆ డిజైన్స్ లో కూడా ఈజీవే వాడికి వస్తాయి. పెద్దవి సరిగ్గా రావు, ఎక్కువ ఖర్చు. రిస్కీ. అయినా సరే ఆ వర్కర్లు, ఇంజనీర్లతో పోరాడి ప్రతి చిన్న ఐటెం దగ్గరుండి చేయించుకున్నాం. సారీ సారీ కట్టుకున్నాం. కానీ పడిన మొత్తం కష్టంలో 30% మాత్రమే మాది. మిగతాది అంతా మా నాన్నది మా అమ్మది మా అన్నయ్యది. వాళ్ళే చెయ్యకపోయి ఉంటే అసలు మేము ఇల్లు కాదు కదా పూరిపాక కూడా కొనేవాళ్ళం కాదు. 

ఇల్లు అంటే once in a life time అన్న ఫీలింగ్ తో ప్రతి చిన్న విషయాన్ని జూమ్ చేసి చూసేవాడిని. దాంతో ప్రతీది గొడవలే. వర్కర్లతో, ఇంజనీర్లతో, మాలో మాకు కూడా. అలా ఇన్ని కష్టాలు గొడవలు పడి ఇల్లు కట్టుకున్నాం. ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే మొన్ననే మా అపార్ట్మెంట్స్ లో ఎవరో ఎక్కడికో వెళ్తూ 1.2 కి ఒక ఫ్లాట్ అమ్ముకున్నాడంట. 95 అయినా 1.2 కి అమ్ముకుంటే లాభం ఉంటుంది కదా అన్న ఆశ... ఆ కష్టాన్ని మరిపించింది. ఇంతకీ చెప్పడం మర్చిపోయా మా అపార్ట్మెంట్స్ లో అందరి కంటే చిన్నవాళ్ళం మేమే. మిగతా అందరూ కనీసం 35+. అందరూ ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ మీరెలా కొనుక్కున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. 

మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి చెప్పినట్టు "ఆస్ట్రిచ్ గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది. కానీ పెట్టే ఆస్ట్రిచ్ కే ఆ నొప్పి తెలుస్తుంది" . అలాగే మా ఫ్లాట్ చూడ్డానికి పెద్దగా బాగుంటుంది. కానీ 95L పెట్టెప్పుడు మాత్రం నాకు రక్త కన్నీరే. ఇక గృహప్రవేశం భారీగా చేసుకుని హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం అనుకున్నా. కానీ ఎక్కడా... ఈ కరోనా గోల వల్ల ఇక మాలో మేమే చేసుకున్నాం గృహప్రవేశం. 

నేను ఎవరికైనా సలహా ఇవ్వాలంటే, ఫుల్లీ ఫినిష్డ్ అయిన ఫ్లాట్ మాత్రమే తీస్కొండి. ఊరికి కొంచెం దూరంగా తెల్లాపూర్, కొల్లూరు, బీరంగూడలో తీస్కోవడం కంటే మెయిన్ సెంటర్లో ఫ్లాట్ కావాలంటే కనీసం 5-10L ఎక్కువ పెట్టాల్సిందే. ఊరికి దూరంగా ఫ్లాట్ తీస్కుంటే ఒక 2-3 ఇయర్స్ అయినా డైలీ కన్స్ట్రక్షన్ సౌండ్లు... సరిగ్గా లేని రోడ్లు, వర్షాకాలంలో బురద ఫేస్ చేయాలి. ఆ కష్టం పడలేము అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టీ మెయిన్ సెంటర్లో తిస్కోవాలీ. 

లేకపోతే, మేము 40 ఇయర్స్ ఏజ్ వచ్చే దాకా రెంటెడ్ హౌస్ లోనే ఉంటాము. అప్పటి దాకా సైట్స్ కొనుక్కుని, 40 ఇయర్స్ కి మంచి ఇల్లు కొనుక్కుంటాము అన్నా కూడా బాగానే ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే ఎప్పటికైనా మీరు ఇల్లు తిస్కోవచ్చూ. 

కాకపోతే సైట్ కొనాలి అంటే, ఈ మధ్య ఈ రియల్ ఎస్టేట్ లో ప్రమోటర్స్ అని తగలడ్డారు. ఆ ప్రమోటర్స్ మీ బంధువులు, స్నేహితుల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు తమదే ఆ సైట్ అన్నంత బిల్డప్ ఇస్తారు. కానీ వాళ్ళకి పైన ఒక వంద మంది చైన్ ఉంటుంది. ఎవరు అమ్ముతున్నారు అని ఎవ్వరికీ క్లారిటీ ఉండదు. ప్రతీ దానికీ సైట్ విసిట్ చేయండి అని బలవంతం చేస్తారు. చూసాక కొనండి అని బలవంతం చేస్తారు. నా సలహా ఏంటంటే సైట్ పర్లేదు దగ్గరే అనిపిస్తే విసిట్ చేయండి. కొనాలి అనుకుంటే కొనండి. పొరపాటున మొహమాటానికి మాత్రం పోవద్దు. మీకిష్టం లేకపోతే నిర్మొహమాటంగా వాళ్ళని బ్లాక్ చేసేయండి. 

అదీ నా ఇల్లు కట్టి చూడు అనే ఒక రియల్ ఎస్టేట్ గాథ. Hope హైదరాబాద్లో ఏదైనా కొనాలి అనే వాళ్ళకి ఇది కొంచెం useful అనుకుంటున్నా. 🙂 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం