బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా??
బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా??
ఈ మాట 2004లో నా 6వ తరగతి తర్వాతి సమ్మర్ హాలిడేస్ లో మా స్పోకెన్ ఇంగ్లిష్ సర్ అడిగాడు. ప్రతి సమ్మర్ హాలిడేస్ లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి కోచింగ్ సెంటర్లకి పంపేవారు మా ఇంట్లో వాళ్ళు. అలా 6 అయ్యాక అనంతపూర్ లో RK spoken english class లో నన్ను మా అన్నయ్యని కలిపి జాయిన్ చేశారు. మా క్లాసులో నేను తప్ప అందరూ ఇంగ్లీష్ మీడియమే. అప్పుడు నా తెలుగు మీడియం ఇంగ్లీష్ చూసిన, ఆ స్పోకెన్ ఇంగ్లిష్ సర్ "బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా?" అని అడిగాడు. సిగ్గుతో తల వంచుకుని "లేదు సర్. తెలుగు మీడియం" అని చెప్పా.
బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా??
మళ్ళీ ఇదే మాట 2008 లో ట్రిపుల్ ఐటీలో విన్నా. ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన కొంత కాలం పాటు అసలు సబ్జెక్టు క్లాసులు ఏవీ నడిచేవి కాదు. కరిక్యులం ఫైనలైజ్ అవ్వలేదు అంటూ ఏదో కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇంగ్లీష్ క్లాసులు పెట్టేవాళ్ళు. ఆ సమయంలో క్యాంపస్ మొత్తానికి కలిపి పెట్టిన మొదటి ఎగ్జాం, ఇంగ్లీష్. ఆ ఎగ్జాంలో నాకు వందకు 92 వచ్చాయి. అది మా OMEGA-7 బాయ్స్ లో highest. అప్పుడు నా దగ్గరకు వచ్చిన మా క్లాస్ మెంటర్ సత్య సర్ "బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియమా?" అని అడిగాడు. అప్పుడు గర్వంగా "లేదు సర్. తెలుగు మీడియం" అని చెప్పా.
పై రెండు ప్రశ్నలకు నేను సిగ్గుపడినా, గర్వపడినా అవతలి వాళ్ళ నుంచి పెద్ద రెస్పాన్స్ లేదు కానీ మూడోసారి వచ్చిన రెస్పాన్స్ నాకు బాగా గుర్తుండిపోయింది.
2012 లో అనుకుంటా... CSE-4 లో క్లాసు అయిపోయాక మధ్యాహ్నం నేను, మా సుబ్బు మెస్ దగ్గరకు బుక్స్ పట్టుకుని వెళ్తుంటే, వచ్చాడు తెల్లగా కళ్ళజోడు పెట్టుకుని ఇంచు మించు మధ్య పాపిడి ఉన్న మా క్లాసు అబ్బాయి.
వచ్చి "నువ్వు ఇంగ్లీష్ మీడియమా?" అన్నాడు. "లేదు లేదు పక్కా తెలుగు మీడియం" అన్నా. అందుకు తను "అవునా మొహం చూస్తే అలా లేదు...!" అని వెళ్ళిపోయాడు. 😌😎 ఆ సమాధానం ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది.
నాలో నాకే "అంటే ఇంగ్లీష్ మీడియం మొహం వేరేలా ఉంటుందా? తెలుగు మీడియం మొహం నాటుగా ఉంటుందా? అవునా ఉంటుందేమో?" అన్న ఆలోచనలతో ఓ చిరునవ్వు వచ్చింది మొహం మీద. ఆ సమాధానం ఇచ్చింది మరెవరో కాదు అప్పటి వెంకట మహేష్ ఇప్పటి Glady.
ఇలా జరిగిన కొన్ని రోజులకు, మా హాస్టల్ రూం BT-98 ఎక్కడ ఉందో తెలుసుకుని వచ్చాడు Glady. చాలా దరిద్రంగా రూం maintenance చేసే నేను, సడెన్ గా కొత్త మనిషి వచ్చేసరికి హడావుడిగా నా బెడ్ సర్దేసా. "ఏం లేదు, నోట్ బుక్ కావాలి" అంటూ చెప్పాడు. ఆ టైంకి నోట్ బుక్ అసలు రాయని నేను, మనకంత సీన్ లేదు అని... తెలిసిన ECE friend దగ్గర బుక్ ఇస్తానని చెప్పాను. అలా కళ్ళ జోడు పెట్టుకుని studious గా పరిచయం అయిన Glady, ఊర మాస్ అని నాకు Counter strike ఆడే దాకా తెలియలేదు సుమీ.
Counter strike లో Glady ఆట నా ఆటకు పూర్తిగా విరుద్ధం. Glady, Sehwag లా attacking team లో ఆడేవాడు. నేను ద్రావిడ్ లా defense team లో ఆడేవాడిని. నా ఆట మొదలయ్యే సరికే, glady ముగ్గురు నలుగుర్ని చంపి చచ్చిపోయేవాడు. మూడేళ్ల కాలంలో Glady, నేను ఇద్దరమే survive అయిన matches లేవంటే అతిశయోక్తి కాదు. ఆటలో ఇంతటి వైరుధ్యం ఉన్న మాకు ఒక గట్టి కామన్ పాయింటు కూడా ఉంది. అదే #కళాపోషణ. 😆🙌
CSE-4 లో ఎవరో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారంట అన్న మాట విని షాక్ అయ్యా నేను. ఎందుకంటే కథలన్నా, సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. మా పాత క్లాసుల్లో కూడా స్కిట్లు చాలా వేసేవాళ్ళం. అలాంటిది ఈ క్లాసులో మనకంటే కళా పోషకులు ఎవరున్నారబ్బా అని తెలుసుకుంటే అది Glady. అయినా ఈరోజుల్లో కెమెరాలు తెచ్చుకుని అందరూ షార్ట్ ఫిల్మ్ అని తీస్తున్నారు. ఏం మాత్రం తీస్తారో చూద్దాం అనుకున్న నాకు, Glady తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒక షాక్.
కెమెరా ఏంగిల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. భలే ఉందే అనిపించింది. Glady తర్వాత కూడా ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని తెలిసి నేనే ఆ రూం కి వెళ్ళాను. అసలు షూటింగ్ ఎలా జరుగుతుందా అని చూడ్డానికే వెళ్ళాను. నాక్కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇష్టం అంటూ పరిచయం చేసుకున్నాను.
అలా ఆ పరిచయంతోనే ఒక చీకటి రాత్రి, బంటి వాళ్ళ రూంలో నేను, నాయుడు, ఎర్రయ్య కలిసి HR షార్ట్ ఫిల్మ్ కి ఆజ్యం పోశాం. writing చాలా ఎంజాయ్ చేశాం, 2 డేస్ షూటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేశాం కానీ ఎడిటింగ్ మాత్రం చుక్కలు చూపించింది. Glady ఒక్కడే రోజూ రాత్రి 2 గంటల చొప్పున సుమారు 2-3 నెలల పాటు ఎడిటింగ్ చేసాడు. నాకు నిజంగా సారీ చెప్పాలని అనిపించింది. ఏదో నాకున్న ఇంటరెస్ట్ కొద్దీ ఓ స్టోరీ Glady మీద రుద్ది తప్పు చేశాను అనిపించింది.
వదిలేయ్ Glady తర్వాత చూద్దాం అన్నా కూడా తను ఒక్కడే ఆ ఎడిటింగ్ పూర్తి చేశాడు. Glady ఒక పని మీద కూర్చుంటే అది అయ్యేదాకా వదలడు అన్న దానికి అది ఒక sample మాత్రమే. భగవద్గీత పారాయణం ఇంకా చాలా ఉంది.
ఏదో సెమిస్టర్ రిజల్స్ట్ వచ్చిన రోజు రాత్రి, నైట్ క్లాసుకు లేట్ గా వెళ్తూ చివర ఉన్న Glady వాళ్ళ రూం వైపు చూస్తే Glady ఒక్కడే చదువుకుంటూ ఉన్నాడు. "ఏంటి Glady తిన్నావా?" అని అడిగితే "ఏం సాధించాం అని తినడానికి" అన్నాడు. ఒక్కసారి ఖంగుతిన్నా. ఈ మాట కమ్యూనిస్టు భావజాలంలోనే కాదు, మా నాన్న నోటి వెంట కూడా వింటూ ఉంటాను నేను.
అలా ఏదో ఒకటి సాధించే తపన నాకు Glady తో కలిసి చేసిన ఇంటర్న్ షిప్ ప్రాజెక్టు అప్పుడు కూడా కనపడింది. నేను, బంటి, Glady ముగ్గురం బెజవాడ BSNL లో ఇంటర్న్ షిప్ చేశాం. Banti, Glady ఇంటర్న్ షిప్ కోసం BSNLకి వస్తే, నేను వచ్చిన purpose వేరు. వారం రోజుల ఇంటర్న్ షిప్ అవ్వగానే నేను హైదరాబాద్ గేట్ కోచింగ్ కి చెక్కేస్తే, ఇంటర్న్ షిప్ ప్రాజెక్టు కోసం Glady banti చాలా కష్టపడ్డారు. బంటి android app చేస్తే, Glady సొంతగా తానే VB.NET తో ఒక Desktop అప్లికేషన్ చేశాడు. అది నాకు అప్పటికి ఒక వింత. అదే కాదు Counter strike లో de_dust2 bomb spot A కి వెళ్ళే గుహలో ఒక్క సెకండులో 6 headshots వేశాడు Glady. అది కూడా ఒక వింతే నాకు.
పైకి ఊర మాస్ గా కనిపించే Glady, చాలా లోతున్న మనిషి. చిన్న కష్టం వచ్చినా లబో దిబోమంటూ స్టేటస్లు పెట్టేసే మనకి, Glady తన లోతును చెప్పడు చూపించడు. ఎంత సేపు మాట్లాడినా అవతలి వాళ్ళ పర్సనల్ విషయాలు అడగడు, తన గురించి ఎక్కువ చెప్పడు. తాను అంతే దూరంలో నుంచుని మాట్లాడాల్సిన విషయాలు మాత్రమే మాట్లాడతాడు. చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్తాడు. Most eligible bachelor అయిన Glady త్వరగా పెళ్లి చేసేస్కుని హైదరాబాద్లో సెటిల్ అయిపోతే ఏదో ఒక కళా పోషణకు రంగం సిద్ధం చేయాలి అన్నది నా ప్లాన్. చూద్దాం ఆ విధి ఎక్కడి వరకు మనల్ని నడిపిస్తుందో. Love you Glady ❤️ Keep your Lionheart up 🦁
Glady mama ki 🙏🙏👏
రిప్లయితొలగించండి