ఆడాలంటే ఓడాలి
జీవితంలో మనం ఆడే ప్రతీ ఆట గెలవాలనే ఆడతాం. ఎందుకంటే ఓటమిని మనం తట్టుకోలేం. గెలిస్తేనే నిలబడతాం అని అనుకుంటాం. కానీ ఓడిపోవడానికే మనం ఆడాల్సి వస్తే... అది 2012-13 సమయం. మా కాలేజీలో కౌంటర్ స్ట్రైక్ మానియా కొనసాగుతున్న రోజులు. ట్రిపుల్ ఐటీ లో కౌంటర్ స్ట్రైక్ తోపులు అంటే మా క్లాసు టీ-4 (CSE-4 ). 2,000 పై చిలుకు స్టూడెంట్స్, 30+ క్లాసులు, 6 బ్రాంచీలు. అందరూ మా క్లాసు ముందు దిగదుడుపే. మావాళ్లపై గెలుస్తామని పందాలు వేస్కుని కూడా ఓడిపోయిన వాళ్ళు బోలెడు. అలాంటి క్లాసులో కౌంటర్ స్ట్రైక్ చాలా లేటుగా మొదలెట్టా నేను. ఒక కారణం అడిక్ట్ అయిపోతానేమో అన్న భయం. ఇంకొకటి తలనొప్పి. అదేంటో ఏ 3D గేమ్ ఆడినా కాసేపటికి తలనొప్పి వచ్చేది. కానీ మా క్లాసు యొక్క ఫేం చూసి నాక్కూడా నేర్చుకోవాలనిపించింది. చిన్నగా మా రషు గాడి పక్కన చేరి ఆట నేర్చుకోవడం మొదలెట్టా. మొదట్లో DEVIL అనే కౌంటర్ స్ట్రైక్ పేరు పెట్టుకుని ఒక మూలన దాక్కుని కాల్చేవాడిని. ఆట బాగా వచ్చాక, పేరు ఛత్రపతి గా మార్చుకుని ఆడేవాడిని. ఆ పేరుకి కారణం ఛత్రపతి శివాజీ లాంటి యుద్ధవిద్యలతో నేను కూడా ఆడాలి అని. ఛత్రపతి సినిమా కూడా మన ఫేవరెట్టే అనుకోండి. అంత మం...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి