నా ఫారిన్ కల

నాకు చిన్నప్పటి నుంచి ఫారిన్ వెళ్ళాలి అని కోరిక. మా బంధువులు కూడా చాలామంది... US, UK ల్లో స్థిరపడ్డారు. నాకు కూడా ఇండియాలో ఉండడం కంటే అక్కడికి వెళ్ళడమే చాలా ఇష్టంగా ఉండేది. కాలేజీలో ఉన్నప్పుడు 2010 లో అనుకుంటా Barron's GRE book ఒకటి కొనుక్కున్నా. అందులో ఉండే Questions solve చేస్తూ ఉండేవాడిని. ఇంగ్లీషులో నాకు గుర్తుండి A grade కంటే తక్కువ ఎప్పుడు రాలా, అందుకే ఆ GRE Questions నాకు పెద్ద కష్టంగా కూడా అనిపించలేదు. ఎలా అయినా B.Tech అయిపోగానే MS కి వెళ్ళిపోదాం అని 2010 టైంలో అనుకునేవాడిని. 

కానీ ప్రేమలో పడగానే సమీకరణాలు అన్నీ మారిపోయాయి.
మనం ఫారిన్ వెళ్ళిపోయి, తనకి ఇక్కడ వేరే పెళ్లి చేస్తే మళ్ళీ అమెరికాలో దేవదాసులు ఎక్కడ అవుతాంలే అని... ముందు ఇక్కడ జాబ్ తెచ్చుకుని తర్వాత ఆ జాబ్లో ఫారిన్ వెల్దాంలే అని డెసిషన్ మార్చుకున్నా. అనుకున్నట్టుగానే దేవుడి దయవల్ల క్యాంపస్ లోనే జాబ్ వచ్చింది. 

ఇన్ఫోసిస్ హైదరాబాద్లో పోచారం క్యాంపస్ లో జాబ్ చేసేవాడిని. పోచారం అంటే హైద్రాబాద్ కి చివర. నేను ప్రేమించిన అమ్మాయి ఏమో మాదాపూర్ లో ఉండేది. ఇక ప్రతి వీకెండ్ తనని కలవడానికి పోచారం టు మాదాపూర్ వచ్చేవాడిని. ఒక్క రావడానికే 2-3hrs పట్టేది. వెళ్ళడానికి ఖచ్చితంగా 3hrs. మధ్యలో కలిసేది 2hrs. అలా నా వీకెండ్ సగం బస్సులోనే గడిచిపోయేది. 

ఆ టైంలో తన ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పాక... అందరికీ వచ్చినట్టే మాకూ కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. కష్టపడి ఎలాగో వాటి నుంచి గట్టెక్కాం. 

అప్పటికి నాకు IT experience 1.6 ఇయర్స్. ఆ టైంలో మా మేనేజర్ నేను అడగకుండానే, నాకు జర్మనీ వర్క్ పర్మిట్ రైస్ చేస్తాను అన్నాడు. కానీ ఒక్కళ్ళు వెళ్ళడానికే కుదురుతుంది, తనతో కలిసి వెళ్ళాలంటే టైం పడుతుంది అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో ఒరాకిల్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. అప్పటి దాకా సగం డెవలప్మెంట్ చేస్తున్న నాకు ఒరాకిల్ లో ఫుల్ డెవలప్మెంట్ చేసే ఛాన్స్ వచ్చింది, మంచి ప్యాకేజీ. అన్నిటి కంటే నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది మాత్రం, ఆ కంపెనీ ఉన్న లొకేషన్. కంపెనీ ఉంది హైటెక్ సిటీలో. ఇక నేను ఆలోచించలేదు. పక్కనే మాదాపూర్ కాబట్టి తనని ప్రతిరోజు కలవొచ్చు అన్న ఆలోచనతో వర్క్ పర్మిట్ వద్దు అని చెప్పేశా. 

మా మేనేజర్, "నువ్వు టెంపరరీ గా ఆలోచిస్తున్నావు. ఒక్క 2 ఇయర్స్ down the line కి నువ్వు చాలా ఎర్న్ చేస్తావు" అన్నాడు. వినలేదు నేను. అలా కళ్లు మూసుకుని ఒరాకిల్ కి వచ్చా. 

కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాక మా టీం మెట్స్ ని నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఆన్ సైట్ ఉందా. దానికి వాల్లిచ్చిన సమాధానం...

"మన టీమ్స్ లో ఆన్ సైట్ ఉండదు. వెళ్ళినా చాలా ఎక్కువ experience ఉన్న మేనేజర్లు వెళ్తారు. లాస్ట్ 10 ఇయర్స్ లో మన టీమ్స్ నుంచి ఆన్ సైట్ వెళ్ళింది ఒకే ఒక్కరు" అన్నారు. 
ఆశలు అడియాశలయ్యాయి. ఇక ఆ కంపెనీలో ఉన్నంతకాలం లెర్నింగ్ మీదే ఫోకస్ పెడదాం అనుకున్నా. on job లెర్నింగ్ లేదు కానీ off the job లెర్నింగ్ బాగానే చేశా. ఇక నేర్చుకున్నాక, ఆన్ సైట్ ఛాన్స్ లేని అక్కడ ఉండడం వేస్ట్ అని ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీకి జంప్ చేశా. 

రావడం రావడం నిర్మొహమాటంగా ఆన్ సైట్ కావాలి అంటూనే జాయిన్ అయ్యా. ప్రాజెక్టుల గోలలు, బాలారిష్టాలు అన్నీ తప్పించుకుని, ఇదిగో ఆన్ సైట్ వస్తుంది అదిగో ఆన్ సైట్ వస్తుంది అని అందరూ అంటూ ఉండగా కరోనా మొదలయింది. 

IT ఇండస్ట్రీని కరోనా ఎంత ఎఫెక్ట్ చేసిందో తెలీదు కానీ. కరోనా టైంలో నాకు వచ్చిన అనారోగ్యం మాత్రం నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. దాంతో చిన్న జర్నీ కూడా చేయలేని పరిస్థితి. చేస్తే ఒళ్ళు అంతా షివరింగ్. కొంచెం కూడా స్ట్రెస్ తీస్కొలేని పరిస్థితి. ఎప్పుడు ప్రశాంతంగా... లైట్ స్ట్రెస్, మోర్ exercise ఉండాలి. ఎప్పుడూ ఎవరోకరి సపోర్ట్ ఉండాలి. 

ఇక వద్దు అనుకున్నా, ఇంట్లో కూడా అందరితో మాట్లాడి ఇక లైఫులో ఆన్ సైట్ అనేదే లేదు అని ఫిక్స్ అయ్యా. ఉంటే, బ్రతికున్నంత కాలం ఫ్యామిలీ మధ్యలో ఇండియాలోనే ప్రశాంతంగా ఉండాలి అని... మొన్న మొన్న కంపెనీలో అందరూ ఎంత బలవంతం పెడుతున్నా... ఆన్ సైట్ అనేది నాకు వద్దే వద్దు బాబు అని చెప్పేశా. 

అలా ఫారిన్ వెళ్ళాలి అనుకున్న నా చిన్ననాటి కల కాస్తా కంటి ముందు భస్మం అయిపోయింది. ఎన్ని కలలున్నా, జీవితంలో మనకు అన్నిటికంటే ముఖ్యమైనది జీవించడం... ప్రశాంతంగా జీవించడం. ఇంక ఏదీ ముఖ్యం కాదు. 👍

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం