నా జీవితంలో జాంబవంతులు - Part 2
సక్సెస్ అబ్సెషన్ - అంటే ఎప్పుడూ మనం విజయమే సాధించాలి అనే విపరీతమైన కోరిక. కోరిక ఉండడం మంచిదే, కానీ అది అబ్సెషన్ అవ్వకూడదు. అలా ఉంటే ఒక్క ఓటమి, మనల్ని అధోపాతాళానికి తొక్కేస్తుంది.
నాకూ ఉండేది, సక్సెస్ అబ్సెషన్. పదవ తరగతి వరకు నేనెప్పుడూ ఫస్ట్ రావడంతో దానికే అబ్సెస్ అయిపోయా. విపరీతమైన పొగరుతో ఉండేవాడిని. నా మీద ఎవ్వరూ జోకులు వెయ్యకూడదు. ఒక హిట్లర్ మెంటాలిటీలో ఉంటూ, ఆఖరికి దేవుడికి కూడా ఫస్ట్ రావాలనే మొక్కునేవాడిని. అలాంటి అబ్సెషన్ తో ఉన్న నేను, అందరూ టాపర్లే అయిన ట్రిపుల్ ఐటీకి వచ్చా.
రాగానే అందరినీ వాళ్ళ 10th మార్కులు అడిగా. వాళ్ళ మార్కుల బట్టి వాళ్ళని బేరీజు వేసి మాట్లాడ్డం మొదలెట్టా. నాకంటే తక్కువ ఉండే వాళ్లు తక్కువ, నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ. అప్పటికి మా Omega-7 లో నాకు, మా ప్రసాద్ కే 10th Highest మార్కులు అనుకుంటా. ఇక నా గర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
అప్పటి వరకు స్కూల్లో నా మీద ఎవరూ జోకులు వేసిన పాపాన పోలేదు. ఇక్కడికి రాగానే, మా APN, రాంబాబు, నౌషాద్, శివ అందరూ నన్ను ఆట పట్టించేవాళ్ళే. నేనేమో సీరియస్ అయిపోయేవాడిని. దాంతో వీడితో ఎందుకులేరా బాబు అనుకుని, అందరూ నాకు దూరం ఉండేవాళ్ళు. కానీ, మా శివ గాడు (వెలంకాయల శివ) మాత్రం నన్ను ఎందుకో అర్థం చేసుకున్నాడు. "ఎప్పుడు సావధానంగా మాట్లాడాలి. కోప్పడకూడడు." అంటూ నాకు చెప్పేవాడు. నిజానికి అప్పటికి నా IQ, EQ levels చాలా తక్కువ. మా ఫ్రెండ్స్ కి అప్పటికి ఉన్న IQ, EQ నాకు ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మా హాస్టల్, గామా-2 లో మా శివ గాడు కూడా నాతో మాట్లాడకపోయుంటే... నేనెప్పుడో ట్రిపుల్ ఐటీ విడిచి వెళ్ళిపోయేవాడిని.
నాకు మా శివకి కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇద్దరం పెద్ద మెగా ఫ్యాన్స్. ఇద్దరికీ సినిమాల పిచ్చి. మగధీర, అరుంధతి చూసాక... ఇద్దరం నైట్ క్లాసులు మానేసి, ఆ సినిమాల based గా కొత్త కథలు అల్లుకునే వాళ్ళం. ప్రతీ కథలోనూ రామ్ చరణ్ మాత్రమే హీరో.
క్రికెట్ దగ్గర కూడా, నాకు వచ్చిన దరిద్రమైన క్రికెట్ కి నన్నెవరూ టీంలోకి తీస్కునే వాళ్ళు కాదు. కానీ మా శివ మాత్రం నన్నెపుడూ తన టీంలోకే తీస్కునేవాడు. ఫీల్డింగ్ కూడా నాకు ఇబ్బంది లేకుండా దగ్గర్లోనే పెట్టేవాడు. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే వేరే ఆలోచన లేకుండా వచ్చే నా మాట మా శివ డార్లింగ్.
అలా కాలేజీ రోజులు గడుపుతున్న నాకు, ఫస్ట్ సెమిస్టర్ రిజల్స్ట్ ఒక షాక్. దెబ్బకు గర్వం అణిగింది. ఫస్టు కాదు కదా టాప్-4 లో కూడా లేను. ఆ ఓటమితో అధోపాతాళానికి వెళ్ళిపోయా. ఒక రకమైన depression ఫీల్ అయ్యా. నేను చదవాల్సిన విధానం, నేను పరీక్ష రాయాల్సిన విధానం మారాలని అర్థం అయింది. ఇక మొత్తం మార్చేశా...
2nd సెమిస్టర్ నుంచి అంతా కొత్తగా మొదలెట్టా. అనుకున్నట్టే ఇంటర్నల్స్ వరకూ, నేను మా విజయ్ కలిసి మా శ్రీను మాయ్య స్క్రీన్ brightness దయ వల్ల బాగానే రాశాం. 🤪 కాకపోతే ఎండ్ సెమిస్టర్ కి ప్లేసులు మార్చేశారు. ఎండ్ సెమిస్టర్ ముందు ఏదో టెన్షన్. ఎండ్ సెమిస్టర్ రేపు మొదలు అనగా, ముందు రోజు.. మా మాథ్స్ రాము సర్ మధ్యాహ్నం లంచ్ ముందు ఒక క్లాసు పెట్టాడు.
ఏదో ఒక ప్రశ్న అడిగాడు. ముగ్గురు నలుగుర్ని లేపాడు. వాళ్ళు తప్పు చెప్పారు. నన్ను కూడా లేపాడు. అప్పటికి ఆయనకి నేనొక బెస్ట్ స్టూడెంట్ అన్న ఫీలింగ్ ఉండేది. నేను కూడా తప్పు చెప్పా. ఇక తిట్టేశాడు. "నువ్వేదో బాగా చదువుతావు అనుకుంటే నువ్వు కూడా ఇలానే తయారయ్యావు ఏంటి. అసలు పాస్ అవుదామనేనా?" అంటూ చీవాట్లు పెట్టాడు. కాలేజీకి వచ్చాక అమ్మాయిల ముందు అలా తిట్లు తినడం అదే ఫస్టు. నాకు కన్నీళ్లు వచ్చేశాయి.
క్లాసు ముగించేసి లంచ్ కి వెళ్ళమన్నాడు. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ బాధలో చెప్పులు కూడా క్లాసులోనే మర్చిపోయి రూంకి వెళ్ళిపోయా. మధ్యాహ్నం తినకుండా, క్లాసుకు వెళ్లకుండా రూంలోనే ఉండిపోయా. తర్వాతి రోజు జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ కి ఆరోజు సాయంత్రం స్టేజీ దగ్గర బుక్స్ తీసుకుని చదువుకుంటున్నా. ఇంతలో మా శివగాడు వచ్చాడు.
"ఏంటి మధ్యాహ్నం క్లాసుకు రాలేదు" అన్నాడు.
నాకు ఉన్న బాధ అంతా చెప్పి, ఒక మాట అడిగా... "అరే శివ, ఇప్పుడు నేను నేర్చుకున్న దానికి, నేను అసలు ఫస్ట్ వస్తా అంటావా" అని.
ఏదో పుస్తకంలో చూస్కుంటూ "నీకెంటెహే ఏది అనుకుంటే అది సాధిస్తావు నువ్వు" అన్నాడు. మామూలుగా మా శివ జనరిక్ స్టేట్మెంట్స్ ఇచ్చే రకం కాదు. వాడి నుంచి ఆ మాట వినేసరికి ఆశ్చర్యపోయా.
"ఏంటి" అని మళ్ళీ అడిగా.
"నువ్వు ఏది అయినా అనుకుంటే సాధిస్తావు" అన్నాడు.
తను ఎందుకు ఆ మాట అన్నాడో నాకు తెలీదు కానీ. ఇప్పటికీ నేను ఎప్పుడైనా ఒక వేస్ట్ ఫెలో అన్న ఫీలింగ్ వచ్చిన ప్రతీసారీ ఆ మాటే గుర్తు చేసుకుని నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ఉంటా.
వాడు అన్నట్టే ఆ సెమిస్టర్ -2 లో మా క్లాసు బాయ్స్ లో ఫస్టు నేను 🤭 ఎందుకో ఆ ఓటమి తర్వాత వచ్చిన విజయం, నాలో సక్సెస్ అబ్సెషన్ తీసేసింది. ఎవ్వరూ బాగా రాస్తే వాళ్ళకి ఫస్టు వస్తది అంతే అని ఫిక్స్ అయిపోయా. మీరు కూడా జీవితంలో దేనికి obsessive గా ఉండొద్దు. మీరు రాసే కోడ్ లో అవ్వొచ్చు. మీ లైఫ్ లో కావొచ్చు. ప్రతీది ready to be flexible అన్నట్టే ఉండాలి. ఆ విషయం నాకు అప్పుడే అర్థం అయింది. ఇక ఆ తర్వాత, ఎవ్వరినీ మార్కులు అడిగేవాడిని కాదు. చెప్పే వాడిని కాదు. గెలిస్తే గెలిచాం, ఓడిపోతే ఓడిపోయాం అన్నట్లే ఉండేవాడిని.
అలా నా జీవితంలో నాకొక బెస్ట్ కాంప్లిమెట్ ఇచ్చి, నా లైఫ్ లో కొన్ని సంవత్సరాలు తీపిగా ఉండేలా చేసిన మా శివ డార్లింగ్ నాకెప్పటికీ బెస్ట్ ఫ్రెండే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఒకసారి మా మావయ్య కాలేజీకి వచ్చి మా శివ గాడిని చూసి "ఈ అబ్బాయి ఎవరు మన బంధువుల అబ్బాయిలా ఉన్నాడు" అన్నాడు. అవును శివని చూస్తే మా బంధువులను చూసినట్టే ఉంటుంది. Love you darling. నీకున్న కల్మషం లేని మంచి మనసుకి, నువ్వు అనుకున్న అన్నీ విజయాలను జీవితంలో సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 💗
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి